Viral: మార్చురీలో వింతగా అరుపులు, కేకలు.. వెళ్లి చూడగా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.!
దేశంలో ఆడవారికి రక్షణ లేకుండాపోతోంది. ఒకవైపు కోల్‌కతా ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మరువకముందే.. దేశం నలుమూలల మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో మరో షాకింగ్ ఘటన ఒకటి నోయిడాలో వెలుగు చూసింది.
దేశంలో ఆడవారికి రక్షణ లేకుండాపోతోంది. ఒకవైపు కోల్‌కతా ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మరువకముందే.. దేశం నలుమూలల మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో మరో షాకింగ్ ఘటన ఒకటి నోయిడాలో వెలుగు చూసింది. సెక్టార్ 94లో ఉన్న ఓ పోస్టుమార్టం హౌస్‌లో.. అందులో పనిచేసే ఉద్యోగి ఒకరు.. మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ నీచపు పనిని మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. కాగా, ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఒక నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
వైరల్ వీడియో ప్రకారం.. మార్చురీలోని డీప్ ఫ్రీజర్ రూమ్‌లో ఓ వ్యక్తి మహిళను లోబర్చుకున్నట్టు మీరు చూడవచ్చు. ఆమెతో అతడు అభ్యంతరకరమైన స్థితిలో కనిపించగా.. ఈ వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి.. తర్వాత తన వంతు అని చెప్పడం మీరు గమనించవచ్చు. ఈ ఇద్దరు నిందితులు మృతదేహాలను డీప్ ఫ్రీజర్‌లో భద్రపరిచే గదిలో ఈ నీచపు పనికి పాల్పడ్డారు. ఇక మార్చురీలో ఎలాంటి మహిళా ఉద్యోగి విధులు నిర్వర్తించకపోవడంతో.. ఆ మహిళ అక్కడికి ఎలా వచ్చిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం
⚡️संवेदनशील दृश्य ⚡️
नोएडा के पोस्टमार्टम हाउस में चल रहा है अय्याशी। डीप फ्रीजर रूम, जहां शव रखे जाते हैं… वहां एक पुरुष और एक महिला आपत्तिजनक हरकतें कर रहे थे। साथ में काम करने वाले दोस्त ने वीडियो बनाकर वायरल कर दिया।#Noida @noidapolice pic.twitter.com/CvGgX6BqNX
— Pramod Yadav (@Pramod_Atri) August 22, 2024
కాగా, పోస్టుమార్టం హౌస్‌లో స్వీపర్ కాంట్రాక్ట్‌పై పని చేస్తుండగా.. అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించినట్టు పోస్టుమార్టం హౌస్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ జైసాలాల్ తెలిపారు. ఈ ఘటనపై నోయిడా డీసీపీ స్పందిస్తూ.. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని.. పోలీస్ స్టేషన్ సెక్టార్-126లో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి