AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పు ఎవరు చేసిన శిక్ష తప్పదు.. చంద్రబాబు, వైఎస్ జగన్‌లపై బీజేపీ చీఫ్ వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు

తప్పు ఎవరు చేసిన శిక్షపడుతుందని... అదీ చంద్రబాబు అయినా, ఏపీ సీఎం జగన్ అయినా చట్టం ముందు తప్పించుకోలేరని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు.

తప్పు ఎవరు చేసిన శిక్ష తప్పదు.. చంద్రబాబు, వైఎస్ జగన్‌లపై బీజేపీ చీఫ్ వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు
Somu Veerraju
Balaraju Goud
|

Updated on: Mar 19, 2021 | 6:49 PM

Share

Somu Veerraju sensational comments: తప్పు ఎవరు చేసిన శిక్షపడుతుందని… అదీ చంద్రబాబు అయినా, ఏపీ సీఎం జగన్ అయినా చట్టం ముందు తప్పించుకోలేరని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తే సహించేదీలేదన్నారు. వైసీపీ నేతల బెదిరింపులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భయపడరని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. వైసీపీ దౌర్జన్యాలను, అరాచకాలను ఎదుర్కోగల ధైర్యం కేవలం బీజేపీకి మాత్రమే ఉందని వీర్రాజు అన్నారు. వివిధ ఎన్నికలలో వైసీపీ సాధించిన విజయాల్లో నైతికత లేదన్న ఆయన… దౌర్జన్యాలకు పాల్పడకుండా ఏ ఎన్నికలోనైనా వైసీపీ గెలిచిందా? అని ప్రశ్నించారు. ఉపఎన్నికకు సంబంధించి తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరుపై ఆయన ఘాటుగా స్పందించారు. కొందరు అధికారులు వైసీపీ కోసం పని చేస్తున్నారని దుయ్యబట్టారు. తిరుపతి ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమన్న ఆయన.. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోనే ముందుకెళ్తామని చెప్పారు. అభివృద్ధే అజెండాగా ముందుకు సాగుతామని… జనసేనతో కలిసి ప్రచారం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉపఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి విజయం సాధించడం తథ్యమని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.

Read Also…  AP Corona Cases Update: ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే.!