Attack on APPSC bus drivers: సుధీర్‌ నేర సామ్రాజ్యం చూసి ఖాకీలు షాక్‌.. బ్యాక్‌గ్రౌండ్‌ బడా నెట్‌వర్క్‌

|

Nov 12, 2023 | 4:21 PM

నెల్లూరు జిల్లా కావలిలో విజయవాడ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు రాంసింగ్‌, శ్రీనివాసరావులపై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు సుధీర్‌ (43)ను పోలీసులు గురువారం (నవంబర్‌ 9) అరెస్టు చేశారు. జిల్లాలోని పది పోలీస్ స్టేషన్లలో నమోదైన 25కి పైగా క్రిమినల్ కేసుల్లో సుధీర్‌ నిందితుడిగా ఉన్నాడు. ఈ మేరకు డ్రైవర్లపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడైన డి సుధీర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ కె తిరుమలేశ్వర రెడ్డి తెలిపారు..

Attack on APPSC bus drivers: సుధీర్‌ నేర సామ్రాజ్యం చూసి ఖాకీలు షాక్‌.. బ్యాక్‌గ్రౌండ్‌ బడా నెట్‌వర్క్‌
Attack on APPSC bus drivers
Follow us on

నెల్లూరు, నవంబర్‌ 10: నెల్లూరు జిల్లా కావలిలో విజయవాడ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు రాంసింగ్‌, శ్రీనివాసరావులపై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు సుధీర్‌ (43)ను పోలీసులు గురువారం (నవంబర్‌ 9) అరెస్టు చేశారు. జిల్లాలోని పది పోలీస్ స్టేషన్లలో నమోదైన 25కి పైగా క్రిమినల్ కేసుల్లో సుధీర్‌ నిందితుడిగా ఉన్నాడు. ఈ మేరకు డ్రైవర్లపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడైన డి సుధీర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ కె తిరుమలేశ్వర రెడ్డి తెలిపారు.

సుధీర్ నేర సామ్రాజ్యాన్ని చూసి పోలీసులు విస్తుబోయారు. కావలిలోని నిందితుడి నివాసంలో సోదాలు నిర్వహించారు. అక్కడ రూ.7లక్షల నగదుతో, నాలుగు ఎయిర్ పిస్టల్స్, నాలుగు రైండ్ల మందుగుండు సామాగ్రి, రెండు కార్లు, 4 వాకీ టాకీలు, బేడీలు, రెండు జామర్లు, 20కిపైగా సెల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, కత్తులు, ఐరన్ స్టిక్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు సుధీర్ పై 25 కేసులు నమోదైనట్లు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. అక్టోబరు 26న బస్సు డ్రైవర్లు బి రామ్‌సింగ్, శ్రీనివాసరావులపై దాడి, రోడ్డు స్థలం కావాలని మాజీలు హారన్‌ ఊదడంతో రక్తసిక్తమైన ఘర్షణ జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. బస్సు బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ కేసుకు సంబంధించి సుధీర్ సహచరులు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

సుధీర్ తన గ్యాంగ్‌తో అమాయకులను మోసగిస్తూ నేరాలకు పాల్పడుతున్నట్లు ఆయన వెల్లడించారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని, రద్దయిన 2వేల రూపాయల నోట్లు మార్పిడి చేస్తామని, దొంగ నోట్ల మార్పిడి పేరుతో సుధీర్ ఎంతోమంది అమాయకులను మోసగించిటన్లు తెలిపారు. తెలంగాణలో సైతం సుధీర్ బాధితులు ఉన్నారని ఎస్పీ తెలిపారు. సినిమాను తలపించే విధంగా సీన్ క్రియేట్ చేసి, పక్కా ప్రణాళికతో మోసం చేసేవాడని ఆయన తెలిపారు. సుధీర్ నేరాలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని, ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనేది కూడా ఆరా తీస్తున్నట్లు తెలిపారు. సుధీర్‌ వల్ల మోసపోయిన ఆరుగురు బాధితులు తమకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారని వివరించారు. అయితే వారు తొలుత ఫిర్యాదు చేసేందుకు భయపడినట్లు ఆయన పేర్కొన్నారు. సుధీర్‌ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లపై దాడి కేసులో దర్యాప్తు చేయగా.. సుధీర్‌ నేర చరిత్ర బయటపడినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.