AP SSC Exams 2024: ‘విద్యార్ధులకు గమనిక.. ఇకపై ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏడు పేపర్లకు’.. మంత్రి బొత్స
రెండు రోజులు జరిగే సైన్స్ పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం కేటాయిస్తారు. ఐతే మిగతా అయిదు సబ్జెక్టులు మాత్రం ఒక్కోపేపర్ వంద మార్కులకు ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు అమలులోవున్న కాంపొజిట్ విధానాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం తెలుగు/సంస్కృతం, ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ/ పార్శీ పరీక్షలు 70/30 మార్కుల విధానంలో నిర్వహిస్తూ వచ్చారు. ఇకపై ఫస్ట్ ల్యాంగ్వేజ్ భాష పేపర్ ఒక్కటే వంద మార్కులకు ఉంటుంది. తెలుగు సబ్జెక్టు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించి దీని స్థానంలో..

అమరావతి, ఆగస్టు 9: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో గత ఏడాది (2022-23) ఆరు పేపర్లతో పబ్లిక్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏడాది మాత్రం ఏడు పేపర్ల విధానం అమలు చేయాలని ఏపీ విద్యాశాఖ నిర్ణయించింది. సైన్స్ పేపర్‌ను భౌతిక, రసాయన శాస్త్రాలను కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు ఉంటుంది. మరో పేపర్ జీవశాస్త్రంకు 50 మార్కులకు విడివిడిగా ప్రశ్నాపత్రం ఇస్తారు. రెండు పేపర్లకు 17 చొప్పున ప్రశ్నలు వస్తాయి. రెండు పేపర్లకు కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లుగా పరిగణిస్తామని విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు ఆగస్టు 8వ తేదీన విజయవాడలో నిర్వహించిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి పరీక్షల్లో తీసుకువస్తున్న మార్పులను ప్రకటించారు.
పదో తరగతి ప్రశ్నాపత్రంలో చోటుచేసుకున్న మార్పులివే..
రెండు రోజులు జరిగే సైన్స్ పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం కేటాయిస్తారు. ఐతే మిగతా అయిదు సబ్జెక్టులు మాత్రం ఒక్కోపేపర్ వంద మార్కులకు ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు అమలులోవున్న కాంపొజిట్ విధానాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం తెలుగు/సంస్కృతం, ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ/ పార్శీ పరీక్షలు 70/30 మార్కుల విధానంలో నిర్వహిస్తూ వచ్చారు. ఇకపై ఫస్ట్ ల్యాంగ్వేజ్ భాష పేపర్ ఒక్కటే వంద మార్కులకు ఉంటుంది. తెలుగు సబ్జెక్టు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించి దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి, దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని కొత్తగా తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇలా ఇచ్చిన పద్యంపై 4 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున మొత్తం 8 మార్కులకు ఉంటుంది. రెండో ప్రశ్నగా గతంలో పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులకు ఉండేది. ఇప్పుడు పద్యానికి బదులు గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. దీనికి కూడా ఒక్కో ప్రశ్నకు రెండేసి మార్కుల చొప్పున 8 మార్కులు ఉంటుంది.
ఇంకా మంత్రి ఏమన్నారంటే..
గతంలో నిర్వహించిన హేతుబద్ధీకరణ ఆధారంగా అవసరమైన చోటుకు ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేస్తామన్నారు. పురపాలక పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనలు లేనందున పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లుల గడువును పొడిగిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. పదోన్నతులు, బదిలీల కారణంగా రెండు నెలల నుంచి ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందే. వీరందరికీ వారంలో జీతాలు వచ్చేలా చేస్తామన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న 450 మంది ఉపాధ్యాయుల బదిలీలను త్వరలో రిలీవ్ చేస్తామని మంత్రి వెల్లడించారు. మరోవైపు హేతుబద్దీకరణ విధానం వల్ల ఉపాధ్యాయులపై పనిభారం పెరుగుతుందని, ఉపాధ్యాయ పోస్టులు తగ్గాయని, హేతుబద్ధీకరణ ఉత్తర్వులను రద్దు చేస్తేనే విద్యావ్యవస్థకు మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.




మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.