Roja Selvamani: అన్న.. తమ్ముడికి బుద్ధి చెప్పాలి.. మాకు కాదు !! చిరంజీవికి మంత్రి రోజా కౌంటర్

Roja Selvamani: అన్న.. తమ్ముడికి బుద్ధి చెప్పాలి.. మాకు కాదు !! చిరంజీవికి మంత్రి రోజా కౌంటర్

Raju M P R

| Edited By: Phani CH

Updated on: Aug 09, 2023 | 4:05 PM

మంత్రి ఆర్కే రోజా. తిరుపతి జిల్లా వడమాల పేటలో మా భూమి నా దేశం నేల తల్లికి నమస్కారం కార్యక్రమాన్ని టీసీ అగ్రహారం లో ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడేది పవన్ కళ్యాణ్ ఒక్కరే అన్నారు. చిరంజీవి సలహా ఇవ్వాలనుకుంటే ముందు అయన తమ్ముడికి ఇవ్వాలన్నారు. బ్రో సినిమాలో మంత్రి అంబటి క్యారెక్టర్ అవమానించారు కాబట్టి అంబటి రియాక్ట్ అయ్యారన్నారు. కేంద్ర మంత్రి గా పనిచేసిన చిరంజీవి

సినిమా ఇండస్ట్రీలో పెద్దరికంగా వ్యవహరించాల్సిన చిరంజీవి తమ్ముడికి బుద్ధి చెప్పాల్సింది పోయి సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడం సరికాదన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. తిరుపతి జిల్లా వడమాల పేటలో మా భూమి నా దేశం నేల తల్లికి నమస్కారం కార్యక్రమాన్ని టీసీ అగ్రహారం లో ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడేది పవన్ కళ్యాణ్ ఒక్కరే అన్నారు. చిరంజీవి సలహా ఇవ్వాలనుకుంటే ముందు అయన తమ్ముడికి ఇవ్వాలన్నారు. బ్రో సినిమాలో మంత్రి అంబటి క్యారెక్టర్ అవమానించారు కాబట్టి అంబటి రియాక్ట్ అయ్యారన్నారు. కేంద్ర మంత్రి గా పనిచేసిన చిరంజీవి ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. ఎందుకు కాంగ్రెస్ తో పోరాడి ప్రత్యేక హోదాను పెట్టించి సాధించలేక పోయారన్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి లబ్ధి పొందిన చిరంజీవి రాష్ట్రానికి నష్టం చేశారని ప్రజలు గమనించారని ఆరోపించారు. చిరంజీవి చెప్తే వినే స్థాయిలో లేమని, చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి ఆర్కే రోజా.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కొత్త కరోనా !! పెరుగుతున్న కేసుల సంఖ్య

Viral Video: విదేశీ గడ్డపై లుంగీ పవర్‌ ఏంటో చూపించాడు.. వీడియోకి ఫిదా అవ్వాల్సిందే

ఓలాలో కుక్కకు జాబ్ !! ఐడీ కార్డ్ షేర్ చేసిన సీఈఓ !!

అంతరిక్షంలోనూ తప్పని ట్రాఫిక్‌ జామ్‌ కష్టాలు !!

ఇదెక్కడి చోద్యం .. బంతి పూల మొక్కలు చోరీ .. లబోదిబోమంటున్న రైతు

Published on: Aug 09, 2023 04:04 PM