Andhra Pradesh: ‘మన పిల్లల భవిష్యత్ కోసం ఎవరూ తగ్గొద్దు’.. విశాఖ రాజధానిపై మంత్రి ధర్మాన సంచలన కామెంట్స్..
విశాఖకు రాజధాని కోసం సంచలన ప్రకటన చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. సీఎం జగన్ అనుమతి ఇస్తే రాజీనామా చేసి ఉద్యమిస్తానని ప్రకటించారు.
విశాఖకు రాజధాని కోసం సంచలన ప్రకటన చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. సీఎం జగన్ అనుమతి ఇస్తే రాజీనామా చేసి ఉద్యమిస్తానని ప్రకటించారు. విశాఖ రాజధాని కోసం ప్రతి ఒక్కరూ తెగించి పోరాడాలని పిలుపునిచ్చారు. వాళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంటే, తాము నోరుమూసుకుని ఊరుకోవాలా అని ప్రశ్నించారు. విశాఖకు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదన్నారు ధర్మాన. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి అనుమతి ఇస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వెళ్లిపోదామన్న ఆలోచన ఉందని, తమ ప్రాంతానికి సాయం చేసే అవకాశం ఎప్పుడొస్తది? అని వ్యాఖ్యానించారు. ఓ పార్టీ వాడిగా మాట్లాడేదానికంటే.. పార్టీ వాడిని కాకుండా తాను గొంతెత్తితే లక్షలాది మంది తన గొంతు వెనుక ఫాలో అవుతారన్న నమ్మకం తనకుందన్నారు.
ఇంత అన్యాయాన్ని అరికట్టడానికి గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం తనకు ఉందని ధర్మాన పేర్కొన్నారు. ఇన్నాళ్లూ జరిగిన మోసానికి అదృష్టంగా ఏదో ఒక అవకాశం వచ్చిందని, అది కూడా రానివ్వకుండా చేసేవారిని శత్రువులుగానే చూడాలని మంత్రి ధర్మాన ప్రకటించారు. వాళ్ల తరపున నిలబడి వాళ్ల కోసం పనిచేసే అవకాశం ముఖ్యమంత్రి ఇస్తే నేను ఈ పదవి వదిలేసి వెళ్లడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు.
‘‘మన పిల్లల భవిష్యత్తు కోసం ఏ ఒక్కరూ తగ్గడానికి వీలులేదు. ఇది మన అందరి భవిష్యత్తుకు సంబంధించిన అ౦శ౦. అందరూ గొంతెత్తి మాట్లాడాల్సిన సమయం ఇది. ఎవరి ముందైనా మనం తలొ౦చడానికి వీల్లేదని నాలెడ్జ్ ఉన్న వాల్ల౦తా గ్రామాల్లో చెప్పాలి. మా గడప మీదికొచ్చి మాకు రాజధాని వద్దని చెప్పే మీ స్వార్థం ఏ౦టి? అమరావతి నుండి అరసవల్లి వచ్చేవారికి ఎవరు స్వాగతం పలుకుతారో చూడాలి. మీకు రాజధాని వద్దు, అభివృద్ధి వద్దు మీరు ఇలాగే తగలడండి అనే మాట వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చెబితే.. అది అంగీకరించే పరిస్థితి ఉందని చంద్రబాబు భావిస్తే ఎలా ఉంటది. ఏంటి దౌర్జన్యం, ఏంటీ మోసం? మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటారు మేము నోరుమూసుకుని ఊరుకోవాలా?’’ అని టీడీపీ నేతల తీరుపై తీవ్రస్వరంతో ఫైర్ అయ్యారు మంత్రి దర్మాన ప్రసాదరావు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..