Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cockfight: పందెం కోళ్లకు వయాగ్రా.. వాటి మాంసాన్ని పొరపాటున తిన్నారనుకో..

సంక్రాంతి సమీపించడంతో ఇప్పటికే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందేల బరులను సిద్ధం చేశారు. పందాల కోసం ఏర్పాటు చేసే బరులు క్రీడా ప్రాంగణాలను తలదన్నేలా ఉన్నాయి. క్రికెట్‌ మ్యాచ్‌కు మించి కాక్‌ ఫైట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పందెం కోళ్లు రాజభోగాలు అనుభవిస్తున్నాయి. వాటికి డ్రై ఫ్రూట్స్‌తో కూడిన ఆహారంతో పాటు మసాజ్‌లు, వాకింగులు, ఈత కొట్టించడాలు...ఒక్కటేమిటి అన్ని రకాల శిక్షణ ఇస్తున్నారు. సంక్రాంతి సమరానికి వాటిని సిద్ధం చేస్తున్నారు.

Cockfight: పందెం కోళ్లకు వయాగ్రా.. వాటి మాంసాన్ని పొరపాటున తిన్నారనుకో..
Rooster
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 08, 2024 | 12:56 PM

పందాల కోసం ఏర్పాటు చేసే బరులను ముందుగా సిద్ధం చేసిన ఖాళీ ప్రదేశాలలో ప్రత్యేకమైన ఎర్ర మట్టితో చదును చేసి ఉదయం సాయంత్రం నీటితో తడిపి ట్రాక్టర్ సహాయంతో ప్రాంగణాన్ని దున్నుతారు. క్రికెట్ స్టేడియాలకు ఏమాత్రం తీసిపోనీ విధంగా పందెంబరిలో ఏ చోట అయితే కోడిపుంజులు పోరాడతాయో అక్కడ ప్రత్యేకంగా మట్టి మెత్తగా ఉండేవిధంగా ఏర్పాటుచేసి, ఇక పందెంబరి చుట్టూ నాలుగు వైపులా స్తంభాలు పాతి వాటిని ఐరన్ ఫెన్సింగులతో ఎవరు లోపలికి రాకుండా రక్షణగా కడతారు. అదేవిధంగా పందెం బరి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఏర్పాటుచేసి కేవలం కోడిపుంజులు, పెందేం వేసే వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. నాలుగు ద్వారాలను తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులలో వుండే విధంగా ఏర్పాటుచేస్తారు. అలాగే పందేలను వీక్షించే వారికోసం బరి చుట్టూ సోఫాలు, కుర్చీలు ఏర్పాటు చేస్తారు. గతంలో ఈ పందెం బరులను తోటలలో ఏర్పాటు చేసేవారు. అయితే ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు, శుభకార్యాలకు పెద్దపెద్ద షామియానాలు, టెంట్లతో ఏ విధంగా డెకరేషన్ చేస్తారో వాటిని తల దాన్నెలా పందెం రాయుళ్లు పందెం బరులను ఏర్పాటు చేస్తున్నారు.

దేశవాళీ పుంజుల్లో చాలా రకాలు

దేశవాళీ కోడిపుంజులను వాటి రంగుల్ని భట్టి వేరువేరు పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా కాకి, నెమలి, డేగ, సెతువా, పచ్చ కాకి, రసింగి, మైలా, ఇలా రకరకాల పేర్లతో వాటిని పిలుస్తారు. నల్లటి ఈకలు కలిగి ఉన్న కోడిపుంజును కాకి అంటారు. అదేవిధంగా రెక్కలు, శరీరంపై తెల్ల ఈకల ఉండి క్రింద భాగంలో నీలవర్ణంలో ఈకలు ఉన్న కోడిపుంజును నెమలి అంటారు. అలాగే తేనె వర్ణంలో రంగు గల ఈకలు ఉన్న కోడిపుంజుని రసింగి అంటారు. అదేవిధంగా ఎర్రటి రంగులో ఈకలు కలిగి ఉన్న కోడిపుంజును డేగ అనీ పిలుస్తారు. ఇక ఎర్రటి ఈకలు, అక్కడక్కడ నలుపు ఈకలు ఉన్న కోడిపుంజును పచ్చ కాకి అని పిలుస్తారు, పూర్తిగా తెలుపు రంగులో ఈకలు ఉన్న కోడిపుంజును సేతువా అంటారు. అలాగే బూడిద వర్ణంలో ఈకలు కలిగి ఉన్న కోడిని మైలా అని పిలుస్తారు. అలాగే చూడడానికి కోడి పెట్టలాగా ఉండే కోడిపుంజును పెట్టమారు అంటారు. ఇవే కాక ఇంకా పలు రకాల పేర్లతో పందెం పుంజులను పిలుస్తారు. వాటి రంగుల బట్టి కూడా వాటి ధర ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కోడిపందాలు గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్య విషయాలలో కుక్కుట శాస్త్రం చాలా ప్రధానమైనది. ఎందుకంటే మనుషులకి ఒక శాస్త్రం ఉన్నట్టు కోళ్లకు కూడా కుక్కుట శాస్త్రం అందుబాటులో ఉంది.. చాలామంది పందెం రాయుళ్లు కుక్కుట శాస్త్రాన్ని అనుసరించే పందాలు వేస్తారు. కుక్కుట శాస్త్రం ప్రకారం ఒక్కో రంగు కొడిక్కి ఒక్కో నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్ర ప్రభావం భట్టి కూడా కోడిపందాలు వేస్తుంటారు. అదేవిధంగా కుక్కుట శాస్త్రంలో దిక్కులను సైతం లెక్కలోకి తీసుకుంటారు. నక్షత్రం ఆధారంగా ఏ రంగు కోడిని ఏ దిక్కు వైపు నుంచి వదిలితే పందెం గెలుస్తుందో కుక్కుట శాస్త్రంలో వివరించబడి ఉంది. దానినీ ఆధారంగా చేసుకుని చాలామంది పందెం రాయుళ్లు కోడిపందాలు వేస్తుంటారు.

200 బరులు సిద్దం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కోడి పందాలు జరుగుతాయి.. ముఖ్యంగా జిల్లాలో సుమారు 200 పైగా కోడిపందెం బరులు సిద్ధమయ్యాయి.. భీమవరం, కాళ్ళ, ఆకివీడు, పాలకోడేరు గణపవరం మండలాల్లో పెద్ద ఎత్తున ఈ కోడిపందాలు నిర్వహిస్తారు.. అదేవిధంగా మేట్ట ప్రాంతమైన జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, దెందులూరు, ద్వారకాతిరుమల, లింగపాలెం, చింతలపూడి మండలాలతో పాటు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాలలో సైతం పందెంబరులు జోరుగా తయారవుతున్నాయి. పందెం పుంజుల పెంపకానికి వస్తే వాటిని ఎంతో ప్రత్యేక శ్రద్ధతో పెంచాలి. ముందుగా పందెం పుంజుల పెంపకం కోసం విశాలమైన కాళీ ప్రదేశాలలో షెడ్లు నిర్మించి, వాటిలో ప్రత్యేక సౌకర్యాలు కలిగించాలి. ముందుగా శ్రేష్టమైన గుడ్ల నుంచి పొదిగిన పందెం పుంజుల పిల్లలను ఆరు నెలల వరకు గుంపులో పెంచుతారు. అనంతరం వాటి పోరాట పటిమ, రంగు, ఎత్తులను బట్టి వేరు చేస్తారు. అలా వేరు చేసిన వాటిని ప్రతిరోజు ప్రత్యేకమైన ఆహారంతో పాటు, వాటికి అంటూ వ్యాధులు రాకుండా ఉండేందుకు మందులు వాడతారు. అదేవిధంగా వాటి రోగ నిరోధ శక్తికి పిల్లల దశ నుంచే టీకాలు వేయిస్తారు. ఇలా తయారుచేసిన కోడి పుంజులను పండుగకు పది రోజుల ముందు పందెం రాయుళ్లు పెంపకం దారుల వద్దకు వెళ్లి వాటి పోరాటం, రంగు, ఎత్తు ఆధారంగా ధరలు నిర్ణయించి విక్రయిస్తారు.

పందెం కోళ్లకు వయాగ్రా

ఈసారి పందెం కోళ్లకు వ్యాధులు సోకాయి. పందెం పుంజులకు దెరాణిఖెత్ అనే వైరల్ వ్యాధి సోకడంతో అవి బలహీనమయ్యాయి. సంక్రాంతి సీజన్‌లో కోళ్లలో సత్తువ లేకపోవడంతో యజమానులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బరిలో నిలికే కోళ్లు పొగరుతో ఉండాలి. ప్రత్యర్థి పుంజుపై విరుచుకుపడాలి. అలాంటప్పుడే పందెం రాయుళ్లకు కిక్ ఉంటుంది. అయితే తెగుళ్ల కారణంగా కోళ్లు పోటీలకు పనికిరాకుండా పోతున్నాయి. రాణిఖెత్ వ్యాధి కారణంగా పుంజులు చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ వ్యాధి సోకితే కోళ్లు హెల్దీగా ఉండవు. అలాంటి కోళ్లలో వేగంగా శక్తి పెంచడానికి పెంపకందారులు కొత్త మార్గాన్ని అన్వేశించారు. వయాగ్రా, షిలాజిత్, విటమిన్ల కాక్టెయిల్‌తో కూడిన ఫుడ్ అందిస్తూ వాటిని బలంగా తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నారు. అయితే దీనిపై వెటర్నరీ డాక్టర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పదార్ధాలు కోళ్లలో తాత్కాలికంగా పనితీరును మెరుగుపరుస్తాయని, కానీ భవిష్యత్తులో కోళ్లకు హాని తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కోళ్లను మనుషులు తింటే వారి ఆరోగ్యం గల్లంతే అని గట్టిగా చెబుతున్నారు.

ముందుగానే బుక్ అయిన లాడ్జీలు

సంక్రాంతి సమయంలో జరిగే పందాల ఇప్పటికే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ పట్టణాల్లో లాడ్జీల్లోని రూమ్స్ ముందుగానే బుక్కయ్యాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే పందెం రాయుళ్లు నెల ముందుగానే సంక్రాంతి మూడు రోజులు ఉండే విధంగా హోటల్స్‌, లాడ్జిలలో పెద్ద ఎత్తున రూములు బుక్ చేసుకున్నారు. భీమవరం, పాలకొల్లు నరసాపురంలో ఇప్పటికే ప్రముఖ హోటల్స్, లాడ్జిల్లో పండుగ మూడు రోజులు రూములు ఖాళీలు లేవంటూ హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేసాయి. మెట్ట ప్రాంతమైన జంగారెడ్డిగూడెంలో సైతం ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే మరో పక్క పోలీస్ రెవెన్యూ యంత్రాంగం కోడి పందేల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పందెంబరుల ఏర్పాటుపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇప్పటికే గతంలో కోడిపందాలలో పాల్గొన్న వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి, కోడి కత్తులు తయారు చేసే వారిని సైతం అదుపులోకి తీసుకొని హెచ్చరిస్తున్నారు. కానీ పందెం రైలు మాత్రం అవెం మాకు పట్టవంటూ పందాలకు సిద్ధమైపోతున్నారు. ఎందుకంటే పందేలా విషయంలో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువగా ఉండటం, వచ్చే మూడు నెలలలో సార్వత్రికలో ఉండడంతో ఈసారి కోడి పందాలు మరింత ప్రత్యేకంగా మారాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..