Telangana: అక్కడ తెచ్చిన టిఫిన్ తిన్నాక వాంతులు, ఒళ్లంతా చెమటలు.. ఏంటా అని చూడగా
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఇటీవల చేసిన తనిఖీల్లో చాలా హోటల్స్ నిబంధనలు పాటించట్లేదని తేలింది. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కిచెన్‌లో ఎలుకలు, బొద్ధింకలు తిరుగుతున్నాయి. పనిచేసేవారు, పాన్ మసాలా, గుట్కాలు నములుతూ వంటలు చేస్తున్నారు. తాజాగా మీరు కూడా వాంతి చేసుకునే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది

ఫుడ్ విషయంలో శుచి ఎలా ఉన్న శుభ్రత చాలా ఇంపార్టెంట్. రుచి లేకపోతే బాగలేదని తినడం మానేస్తాం.. కానీ అపరిశుభ్రత పరిస్థితుల్లో వండిన విషయం మనకు తెలియదు కదా.. అందుకే వేడి వేడి లాగిస్తాం.. ఆ తర్వాత పర్యవసనాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్స్, హెటల్స్, ఫుడ్ సెంటర్లలో దాడులు చేసి.. అక్కడ వాడే సరుకులు, ఎలాంటి పరిసరాల్లో వండుతున్నారో బట్టబయలు చేసింది. దాదాలు 90 శాతం మంది కనీస శుభ్రత పాటించడం లేదని గుర్తించింది. అంతేకాదు కాలం చెల్లిన సరుకులు వంటల కోసం వాడుతున్నట్లు బయటపెట్టింది. అయినా బయట ఫుడ్ మానలేకపోతున్నారు కొందరు.
తాజాగా టిఫిన్ సెంటర్ నుంచి తెచ్చుకున్న ఫుడ్ పార్మిల్‌లో బల్లి కనిపించడం తీవ్ర కలకలం రేపింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం భీంనగర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఆ టిఫిన్ తిన్న ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో పాటు శరీరమంతా చెమటలు పట్టాయి. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అత్యవసర వైద్యం అందిస్తున్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించి.. వారి అస్వస్థతకు కారణమైన హోటల్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు టిఫిన్ సెంటర్‌ను పరిశీలించి హోటల్ యజమాని అయిన అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు గద్వాల టౌన్ పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.