Smugglers: వద్దు.. వద్దంటున్నా ఇవేం పనులు.? రెచ్చిపోయిన స్మగ్లర్స్.. గంజాయితోపాటు అవి కూడా
ఎన్ని చర్యలు చేపట్టినా ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లను అడ్డుకోలేకపోతోంది పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. ఎంతమందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెడుతున్నా పోలీసుల కళ్ళు గప్పి గంజాయి తరలించకుపోతూనే ఉన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు కూడా గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఫోకస్ పెంచారు. ప్రభుత్వ ఆదేశాలతో నిఘా పెంచి స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. తాజాగా అల్లూరి జిల్లా పెదబయలు జంక్షన్ లో.. తనిఖీలు చేసిన పోలీసులకు భారీగా గంజాయి పట్టుబడింది.
ఎన్ని చర్యలు చేపట్టినా ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లను అడ్డుకోలేకపోతోంది పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. ఎంతమందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెడుతున్నా పోలీసుల కళ్ళు గప్పి గంజాయి తరలించకుపోతూనే ఉన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు కూడా గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఫోకస్ పెంచారు. ప్రభుత్వ ఆదేశాలతో నిఘా పెంచి స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. తాజాగా అల్లూరి జిల్లా పెదబయలు జంక్షన్ లో.. తనిఖీలు చేసిన పోలీసులకు భారీగా గంజాయి పట్టుబడింది. అదే సమయంలో ఒక తుపాకీ కూడా లభించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదబయలు మండలం కొత్త రూడకోట జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా వాహనం కనిపించింది. బొలెరో ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. 420 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. గంజాయితోపాటు వారి వాహనంలో ఓ పిస్టల్ ను కూడా గుర్తించిన పోలీసులు ఖంగుతిన్నారు. గంజాయి తరలిస్తున్న క్రమంలో.. ఎవరైనా అడ్డుపడితే తుపాకితో బెదిరించేందుకు సిద్ధం చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఐదు రౌండ్ల బుల్లెట్లు కూడా ఉండడంతో.. అవసరమైతే ఫైరింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి పది లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితుల్లో ముగ్గురు ఒడిస్సా కు చెందిన వాళ్ళు కాగా.. మరో ఇద్దరు అల్లూరి జిల్లా వాసులని పోలీసులు గుర్తించారు. గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నాన్న దానిపై ఆరా తీస్తున్నారు. ముంచంగిపుట్టి మండలం మూసి పుట్టులో కొనుగోలు చేసి ఒడిస్సా సిమిలిగూడకు తరలిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

