
ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా మూడుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది ఓ యువతి. అది కూడా తండ్రి కారణంగానే. మూడుసార్లూ ఆ యువతిని కాపాడారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. కంచికచర్లకు చెందిన నాగశేషు.. ఏడాది క్రితం జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన వినోద్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వినోద్‌ను పెళ్లి చేసుకున్న ఇరవై రోజులకు భర్త ద్వారా తన తండ్రి సీతారామయ్యకి ఐదు లక్షల రూపాయలను వడ్డీకి ఇచ్చింది నాగశేషు. అయితే, ఎన్నిసార్లు అడిగినా తండ్రి తిరిగి డబ్బు ఇవ్వకపోవడం, మరోవైపు భర్త నుంచి ఒత్తిడి పెరగడంతో చనిపోవాలని నిర్ణయించుకుంది. ఇలా ఒకవైపు తండ్రి, మరోవైపు భర్త మధ్య నలిగిపోలేక ఈలోకం నుంచే వెళ్లిపోవాలనుకుంది.
అలా ఇప్పటివరకు మూడుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది నాగశేషు. గతంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంటానంటూ దిశ యాప్‌కి ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమై కాపాడారు. అలా రెండుసార్లు నాగశేషును రక్షించారు విజయవాడ వన్‌టౌన్ పోలీసులు. ఇక ఇప్పుడు, తన తండ్రి నుంచి డబ్బులు ఇప్పించాలంటూ.. చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌కొచ్చి బ్లేడ్‌తో చేయి కోసుకుని ఆత్యహత్యాప్రయత్నం చేసింది. దాంతో, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
కాగా తన తండ్రి నుంచి డబ్బులు ఇప్పించకపోతే మరోసారి ఆత్మహత్యాయత్నం చేస్తానని చెబుతోంది నాగశేషు. ఒకపక్క భార్య చేయి కోసుకుని ఆస్పత్రిలో ఉంటే, భర్త దినేష్ కూడా డబ్బు కోసమే బాధపడుతుండటమే ఇక్కడ అసలు ట్విస్ట్.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..