AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆత్మస్థైర్యమే ఆమెకు ఆయుధమైంది.. లక్ష్యం ముందు చిన్నబోయిన అంగవైకల్యం!

ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి వీరప్ప ఆకుకూరల వ్యాపారం చేస్తున్నాడు. శివాని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్థానిక విద్యాసాయి కళాశాలలో చదువుకుంది. 8వ తరగతి నుంచి..

ఆత్మస్థైర్యమే ఆమెకు ఆయుధమైంది.. లక్ష్యం ముందు చిన్నబోయిన అంగవైకల్యం!
J Y Nagi Reddy
| Edited By: Subhash Goud|

Updated on: Dec 01, 2024 | 4:28 PM

Share

ఆత్మస్థైర్యమే ఆమెకు ఆయుధమైంది. మనోవిశ్వాసమే ముందుకు నడిపించింది. అనుకున్న లక్షం ముందు అంగవైకల్యం చిన్నబోయింది. క్రీడా – రంగాన్ని ఎంచుకొని రాణిస్తున్న శివని పై స్పెషల్ స్టోరీ.. కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన శివాని ఎమ్మిగనూరు మండలం బనవాసిలోని నవోదయ పాఠశాలలో 10వ తరగతి చదువుతూ జాతీయ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంది. జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించింది. ఆసక్తి, శ్రద్ధ, లక్ష్యం ఉండాలే కానీ.. అంగవైకల్యం చిన్నబోక తప్పదని నిరూపించింది. అందరితో ఔరా అనిపించుకుంటోంది. మద్దికెర గ్రామంలోని పందులకుంట వీధిలో నివసించే ఉప్పర లలిత, వీరప్ప దంపతుల కుమార్తె శివానికి తల్లి దూరమైన

శివాని గెలుపుబాటలో పయనించేలా నిత్యం ప్రోత్సహించిన తల్లి లిఖిత ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. తన తల్లి కూడా దూరం కావడంతో ఆ విద్యార్థిని కుంగుబాటుకు గురైంది. థాయిలాండ్లో 2025 జనవరిలో జరిగే పోటీలకు సిద్ధమవుతున్న తరుణంలో తన తల్లి దూరం కావడంతో ఒకింత నిరాశ ఆమెను అవహించింది.

తల్లి కోరిక నెరవేర్చాలని పోటీల్లో పాల్గొనాలని తండ్రి వీరన్న ధైర్యం ఇస్తూ వచ్చారు. కుమార్తెను ఉన్నతంగా తీర్చిదిద్దాలని తపిస్తున్న తండ్రిని చూసి గ్రామస్థులు అభినందిస్తున్నారు. చిన్నతనంలోనే పోలియో సోకింది. దీంతో ఒక చేయి సరిగాలేదు. అయినప్పటికీ తల్లిదండ్రులు ఆమెను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తమ శాయశక్తులా కృషి చేశారు. ఆకుకూరలు అమ్ముతూ జీవనం సాగించే తల్లిదండ్రులను శ్రమను కూడా శివాని గుర్తించింది. తల్లిదండ్రుల ఆశయ సాధనకు శివాని నిరంతరం పోరాడుతూ అందరి ప్రశంసలు పొందుతోందిది. ఒకటి నుంచి 5వ తరగతి వరకు మద్దికెరలోని ఓ ప్రైవేటే పాఠశాలలో చదివింది. 6 నుంచి బనవాసిలోని నవోదయ పాఠశాలలో చేరారు.

ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి వీరప్ప ఆకుకూరల వ్యాపారం చేస్తున్నాడు. శివాని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్థానిక విద్యాసాయి కళాశాలలో చదువుకుంది. 8వ తరగతి నుంచి అవుట్పుట్ జావిలెన్ త్రో విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో రాణిస్తూ వస్తోంది. ఇటీవల గుజరాత్ ఎఫ్-46 విభాగంలో జావెలిన్హోలో పాల్గొని బంగారు పతకం సాధించింది. శివానిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై పథకం అందించి అభినందించారు. ప్రస్తుతం హైదరాబాదులోని నవోదయ జవహర్ పాఠశాలలో చదువుకుంటోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి