Andhra Pradesh: నేటి నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. విద్యార్థులూ తెలుసుకోండి..

|

Jun 02, 2023 | 5:51 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్‌ 2వ తేదీ నుంచి జూన్‌ 10వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 2న ఫ‌స్ట్ లాంగ్వేజ్, జూన్ 3న సెకండ్ లాంగ్వేజ్, జూన్ 5న ఇంగ్లీష్‌, జూన్ 6 మ్యాథ్స్, జూన్ 7న సైన్స్, జూన్ 8న సోష‌ల్ స్టడీస్‌, జూన్ 9న ఫ‌స్ట్ లాంగ్వేజ్

Andhra Pradesh: నేటి నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. విద్యార్థులూ తెలుసుకోండి..
Tenth Class Exams
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్‌ 2వ తేదీ నుంచి జూన్‌ 10వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 2న ఫ‌స్ట్ లాంగ్వేజ్, జూన్ 3న సెకండ్ లాంగ్వేజ్, జూన్ 5న ఇంగ్లీష్‌, జూన్ 6 మ్యాథ్స్, జూన్ 7న సైన్స్, జూన్ 8న సోష‌ల్ స్టడీస్‌, జూన్ 9న ఫ‌స్ట్ లాంగ్వేజ్ పేప‌ర్ -2, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ 1, జూన్ 10న ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ 2 పరీక్షను నిర్వహించనున్నారు.

ఉద‌యం 9:30 గంట‌ల‌కు నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు పరీక్షలు కొనసాగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు అధికారులు. ఎగ్జామ్ హాల్‌లోకి చీఫ్‌ సూపరింటెండెంట్లతో సహా ఎవరూ కూడా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, కెమెరాలు, ఇయర్‌ ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌లాంటి పరికరాలను పరీక్షా హాల్‌లోకి తీసుకెళ్లకూడదని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..