AP floods: ఏపీలో వరదల బీభత్సంపై బులిటెన్ విడుదల.. 32 మంది మృత్యువాత

ఆపరేషన్‌ విజయవాడ స్టార్ట్‌ అయ్యింది. సిటీని సెట్‌రైట్‌ చేసేందుకు కార్మికులు ఫీల్డ్‌లోకి ఎంటరయ్యారు. మరోవైపు ఏపీలో వరదల బీభత్సంపై ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

AP floods: ఏపీలో వరదల బీభత్సంపై బులిటెన్ విడుదల.. 32 మంది మృత్యువాత
Andhra Floods
Follow us

|

Updated on: Sep 04, 2024 | 9:13 PM

ఏపీలో వర్షాలు, వరదల బీభత్సంపై 4 సెప్టెంబర్, సాయంత్రం 7 గంటలకు బులిటెన్ విడదుల చేసింది. వరదల ప్రకోపంతో రాష్ట్రవ్యాప్తంగా 32 మంది చనిపోయినట్లు వెల్లడించింది. వదరల ప్రభావం ఎక్కువగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో 24మంది మృతి చెందినట్లు తెలిపింది.  గుంటూరు జిల్లాలో ఏడుగురు మృతి.పల్నాడు జిల్లాలో ఒకరు మృత్యువాతపడినట్లు వెల్లడించింది.  1,69,370 ఎకరాల్లో పంట, 18424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపింది.  2లక్షల 34 వేల మంది రైతులకు పంట నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది.  60 వేల కోళ్లు, 222 పశువులు మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. వరదల వలన 22 కరెంట్ సబ్ స్టేషన్‌లు డ్యామేజ్ అయినట్లు వివరించింది. 3973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని..  78 చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డాయని.. ప్రభుత్వం వివరించింది. వర్షం వరదల వలన 6,44536 మంది పౌరులు నష్టపోయినట్లు వెల్లడించింది.  193 రిలీప్ క్యాంపుల్లో  42,707 మంది ఆశ్రయం పొందుతున్నారని..  వరద బాధితులను ఆదుకునేందు 50 ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ టీమ్స్ పనిచేస్తున్నట్లు వివరించింది. కృష్ణా నదికి 3 లక్షల 16 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.

విజయవాడలో మొదలైన క్లీనింగ్‌ పనులు

వరుణ ప్రకోపానికి విజయవాడ విలవిల్లాడింది. రోడ్లు, ఇళ్లు అన్న తేడా లేకుండా… అంతటా నదులు, వాగులే దర్శనమిచ్చాయి. ఇక ఇప్పుడు వరద కాస్త తగ్గినా… బురద మాత్రం భయపెడుతోంది. ఎటు చూసినా బురద, చెత్తాచెదారమే కనిపిస్తోంది. అడుగుతీసి అడుగు వేయడం నరకంగా మారింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. జనజీవనం నరకప్రాయమై… రోడ్లు నడవడానికి వీల్లేకుండా మారాయి.

ఇక ఇప్పుడు వరద కాస్త తగ్గడంతో… పారిశుధ్యంపై ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం. సిటీని క్లీన్ అండ్ గ్రీన్‌ చేసేందుకు… యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి అధికారులతో పాటు కార్మికులను రంగంలోకి దింపింది. ఇప్పటికే వేలాది మందిగా విజయవాడ చేరుకున్న కార్మికులు… పనుల్లో బిజీ అయిపోయారు. బురదతోపాటు పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని క్లీన్‌ చేస్తున్నారు. 20 ఫైరింజన్ల సాయంతో రోడ్లపై ఉన్న బురదను తొలగిస్తున్నారు. 900 మంది శానిటేషన్‌ వర్కర్స్‌… బ్లీచింగ్‌ అండ్‌ ఫాగింగ్‌ పనుల్లో నిమగ్నమయ్యారు.ఇక ప్రభుత్వం నియమించిన 63 మంది ప్రత్యేక అధికారులు… పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అన్ని డిపార్ట్‌మెంట్లను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

మొత్తంగా… వారం రోజుల్లో విజయవాడను యథాస్థితికి తీసుకొస్తామంటున్నారు ప్రభుత్వ అధికారులు. ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..