Guntur: చనిపోయేందుకు అనుమతివ్వండి.. జిల్లా ఎస్పీ వద్ద వృద్ధుడు కన్నీటి పర్యంతం..

అతని వయసు 85 ఏళ్లు. భార్య వయసు కూడా దాదాపుగా అంతే. తరతరాలుగా వస్తున్న వ్యాపారాన్ని కుమారులకు పంచేశాడు. కోట్ల రూపాయలను కొడుకులకు అప్పగించేశాడు. చేతకాని సమయంలో చూసుకుంటారనే భరోసాతో...

Guntur: చనిపోయేందుకు అనుమతివ్వండి.. జిల్లా ఎస్పీ వద్ద వృద్ధుడు కన్నీటి పర్యంతం..
Old Man Complaint To Sp
Follow us

|

Updated on: Jan 24, 2023 | 12:57 PM

అతని వయసు 85 ఏళ్లు. భార్య వయసు కూడా దాదాపుగా అంతే. తరతరాలుగా వస్తున్న వ్యాపారాన్ని కుమారులకు పంచేశాడు. కోట్ల రూపాయలను కొడుకులకు అప్పగించేశాడు. చేతకాని సమయంలో చూసుకుంటారనే భరోసాతో ధీమాగా ఉన్నాడు. కానీ కాలం మారుతున్న కొద్దీ.. తనయుల ప్రవర్తనలో మార్పు వచ్చాయి. ఏ పని చేయలేని స్థితికి చేరుకున్న తండ్రిపై దారుణంగా ప్రవర్తించారు ఆ ప్రబుద్ధులు.. దారుణంగా కొట్టారు. కాళ్లతో తన్నారు. చిత్రహింసలు పెట్టారు. ఈ ఇబ్బందులు తట్టుకోలేని ఆ పెద్దాయన.. నేరుగా జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లాడు. కొడుకులు కొడుతున్న వీడియో చూపించి కంప్లైంట్ చేశాడు. తనకు రక్షణ కల్పించాలని కన్నీటి పర్యంతమయ్యాడు. గుంటూరు సంగడిగుంటకు చెందిన మెహబూబ్‌ఖాన్‌ బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. పూర్వీకుల నుంచి ఈ వ్యాపారం వారికి వారసత్వంగా వస్తోంది. మెహబూబాఖాన్‎కు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

70 ఏళ్లుగా నగరంలో బంగారం దుకాణం నిర్వహిస్తున్న ఆయన.. ఆ దుకాణంతో పాటు రూ.కోట్ల విలువైన ఆస్తులను కుమారులకు ఇచ్చేశారు. తనకు 85 ఏళ్లు రావడంతో ఏ పనీ చేయలేని పరిస్థితికి చేరుకున్నాడు. అతని భార్య కుమారుల వద్ద ఉంటోంది. కుమార్తెకు మతిస్థిమితం లేదు. ఆమె బాగోగులు ముసలివాళ్లమైన మేమే చూసుకోవాల్సి వస్తోంది. ఆమె చికిత్స కోసం, భవిష్యత్ అవసరా కోసం ఉంచిన ఆస్తిని కూడా ఇచ్చేయాలంటూ కుమారులు.. మెహబూబాఖాన్‎కు చిత్రహింసలు పెడుతున్నారు. నిత్యం కొడుతున్నారు. వాళ్లు పెట్టే బాధలు భరించలేకపోయాడు.

ఇక చేసేదేమీ లేక నేరుగా.. పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ వద్దకు చేరుకున్నాడు. వారి బారి నుంచి రక్షణ కల్పించాలని కోరాడు. లేకపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి అనుమతించాలని వేడుకున్నాడు. అంతే కాకుండా కుమారులు కొడుతున్న వీడియోను ఎస్పీకి చూపించాడు. న్యాయం చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఎస్పీ.. ఘటనపై విచారణ జరిపి, ఆ వృద్ధుడికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం