పోలవరంపై మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు.. ప్రాజెక్టును సగంలో వదిలేసి టీడీపీ పారిపోయిందంటూ..

|

Jul 15, 2023 | 1:31 PM

కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం వల్లనే పోలవరం ప్రాజెక్టు మరింత ఆలస్యమైందని ఆరోపించారు అంబటి రాంబాబు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు.

పోలవరంపై మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు..  ప్రాజెక్టును సగంలో వదిలేసి టీడీపీ పారిపోయిందంటూ..
Ambati Rambabu
Follow us on

Ambati Rambabu : పోలవరం ప్రాజెక్టు పట్టాలెక్కకుండా అడ్డుపడింది గత టీడీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్టును మధ్యలోనే వదిలేసి పారిపోయింది టీడీపీ అంటూ మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యం, కమిషన్ల వల్లే డయా ఫ్రం వాల్ నిర్మాణం వరదల్లో కొట్టుకుపోయిందని ఆరోపించారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం వల్లనే పోలవరం ప్రాజెక్టు మరింత ఆలస్యమైందని ఆరోపించారు అంబటి రాంబాబు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు.

లోయర్ కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్ డ్యాం, స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత సీఎం జగన్‌దేనని ప్రశంసించారు. కానీ, టీడీపీ నేతలు, సంబంధిత మీడియా వర్గాలు మాత్రం పోలవరం ప్రాజెక్టు, వైసీసీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..