AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“పోలవరం స్కామ్‌ల ప్రాజెక్టు”.. త్వరలోనే అన్ని బయటపెడతాం..!

టీడీపీ సభ్యుల ఆందోళన మధ్య శాసనసభ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. పోలవరంపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. టీడీపీ ఆందోళన పై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరంపై సభలో మూడు రోజులుగా చర్చిస్తూనే ఉన్నామని సీఎం జగన్ చెప్పారు. పోలవరం స్కామ్‌ల ప్రాజెక్టు అని ఆయన ఆరోపించారు. నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని, కుడి, ఎడమ కాలువలపై అధ్యయనం జరుగుతోందని జగన్‌ తెలిపారు. పోలవరం నిర్మాణంలో డబ్బు ఆదా చేసే చర్యలు చేపట్టామని వెల్లడించారు. నవంబర్‌ […]

పోలవరం స్కామ్‌ల ప్రాజెక్టు.. త్వరలోనే అన్ని బయటపెడతాం..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 19, 2019 | 11:47 AM

Share

టీడీపీ సభ్యుల ఆందోళన మధ్య శాసనసభ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. పోలవరంపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. టీడీపీ ఆందోళన పై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరంపై సభలో మూడు రోజులుగా చర్చిస్తూనే ఉన్నామని సీఎం జగన్ చెప్పారు. పోలవరం స్కామ్‌ల ప్రాజెక్టు అని ఆయన ఆరోపించారు. నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని, కుడి, ఎడమ కాలువలపై అధ్యయనం జరుగుతోందని జగన్‌ తెలిపారు. పోలవరం నిర్మాణంలో డబ్బు ఆదా చేసే చర్యలు చేపట్టామని వెల్లడించారు. నవంబర్‌ 1 నుంచి పోలవరం పనులు మొదలు పెట్టాలని, నాలుగు నెలలుగా పనులు ఆగడానికి చంద్రబాబే కారణమని జగన్‌ మండిపడ్డారు. కాపర్ డ్యామ్ పనులు పైర్తైన తర్వాతే మెయిన్ డ్యామ్ పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక జూన్‌ 2021 నాటికి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

పోలవరం పై తొలిసారిగా రివర్స్ టెండరింగ్‌కు వెళుతున్నామని చెప్పారు. దీనివల్ల రూ.1500 కోట్ల వరకు మిగులుతాయని, గత ప్రభుత్వం సబ్‌ కాంట్రాక్టర్ల ముసుగులో నచ్చిన వారిని తీసుకొచ్చి నామినేషన్‌ పద్ధతిలో వర్క్స్‌ ఇచ్చారని జగన్ విమర్శించారు.

Follow Us
పెట్రోల్‌ పంపు యజమానులకు ఈ సమస్య ఎందుకొస్తుంది? అసలు కారణం ఇదే!
పెట్రోల్‌ పంపు యజమానులకు ఈ సమస్య ఎందుకొస్తుంది? అసలు కారణం ఇదే!
గుంటూరు–రేపల్లె మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు!
గుంటూరు–రేపల్లె మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు!
ఫస్ట్ బాల్ వేసి కుప్పకూలిన ప్లేయర్.. తీరా చూస్తే..!
ఫస్ట్ బాల్ వేసి కుప్పకూలిన ప్లేయర్.. తీరా చూస్తే..!
వందే భారత్ vs శతాబ్ది.. రెండింటి మధ్య అసలు తేడాలేంటి?
వందే భారత్ vs శతాబ్ది.. రెండింటి మధ్య అసలు తేడాలేంటి?
ప్రోమో షూట్‌లో గాయం.. టీమిండియా సిరీస్ నుంచి ఔట్.. ఎవరంటే..?
ప్రోమో షూట్‌లో గాయం.. టీమిండియా సిరీస్ నుంచి ఔట్.. ఎవరంటే..?
కంటి మసక తగ్గాలంటే ఇవే పర్ఫెక్ట్.. ఎంత ఖర్చు అయినా తెచ్చుకోండి..
కంటి మసక తగ్గాలంటే ఇవే పర్ఫెక్ట్.. ఎంత ఖర్చు అయినా తెచ్చుకోండి..
27 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది.. ఇప్పుడు థియేటర్లలో రచ్చ చ
27 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది.. ఇప్పుడు థియేటర్లలో రచ్చ చ
ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై ఆ రైళ్లు అక్కడ ఆగాల్సిందే
ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై ఆ రైళ్లు అక్కడ ఆగాల్సిందే
హీరో నాని విజ్ఞప్తిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..
హీరో నాని విజ్ఞప్తిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..
టీనేజర్లలో వేగంగా పెరుగుతున్న ఊబకాయం, PCOS సమస్యలు..
టీనేజర్లలో వేగంగా పెరుగుతున్న ఊబకాయం, PCOS సమస్యలు..