7న తేలనున్న జగన్ కొత్త కేబినెట్
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. శనివారం ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అక్కడ రాజ్‌భవన్ లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లతో సమావేశమయ్యారు. అనంతరం రాజ్‌భవన్ లోని సాంస్కృతిక మందిరంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రాత్రి హైదరాబాద్ లోనే బసచేసి ఉదయం విజయవాడకు బయల్దేరారు. కాగా, ఈనెల 7న ఉదయం పదిగంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్‌ఆర్‌ఎల్పీ […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. శనివారం ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అక్కడ రాజ్‌భవన్ లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లతో సమావేశమయ్యారు. అనంతరం రాజ్‌భవన్ లోని సాంస్కృతిక మందిరంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రాత్రి హైదరాబాద్ లోనే బసచేసి ఉదయం విజయవాడకు బయల్దేరారు. కాగా, ఈనెల 7న ఉదయం పదిగంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్‌ఆర్‌ఎల్పీ సమావేశం జరగనుంది. కేబినెట్‌తోకి కొత్త మంత్రులను తీసుకోవడంతో పాటు అసెంబ్లీ సమావేశాల గురించి కూడా చర్చించనున్నారు. ఇప్పటికే మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు ఆశావహులు జగన్ ఇంటి చుట్టు చక్కర్లు కొడుతున్నారు.