నవరత్నాల అమలు గ్రామ సచివాలయాలతోనే ప్రారంభమవుతుందని, ఈ వ్యవస్థ సంపూర్ణంగా పనిచేసిన నాటినుంచే అసలైన ప్రభుత్వ పాలన మొదలవుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తనను కలసిన ప్రజా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు వలంటీర్ల వ్యవస్థ ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. ఇప్పటివరకూ సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం రివాజుగా వస్తోందని, కానీ గ్రామ సచివాలయాలు ప్రారంభమైన తర్వాత ఇంటివద్దకే పాలన, పౌర సేవలు చేరతాయని స్పష్టం ఛేశారు. అర్హులందరికీ ప్రభుత్వ లబ్ధిని చేరవేసేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తూ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా నిలుస్తుందని చెబుతున్నారు.
వలంటీర్లు సమాచారం ఇచ్చిన 72గంటల్లోనే అర్హులకు రేషన్ కార్డులు, పింఛను అందుతాయని పేర్కొంటున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బేరీజు వేసుకుంటూనే ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని సీఎం వివరిస్తున్నారు.అక్టోబరు 2నుంచి రాష్ట్రంలో పాలన పరుగులు తీస్తుందని జగన్ వివరించారు.