స్టేజ్‌పై జగన్ వద్దకు దూసుకెళ్లిన వ్యక్తి.. ఉద్యోగం కావాలంటూ..!
73వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం చివర్లో ఓ వ్యక్తి హఠాత్తుగా స్టేజ్‌పై సీఎం వద్దకు దూసుకెళ్లాడు. విజయవాడకు చెందిన కోలా దుర్గారావు అనే వ్యక్తి గతంలో కరెంట్ షాక్‌తో తన రెండు చేతులూ కోల్పోయానని.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి.. ఇవ్వలేదని జగన్ వద్ద వాపోయారు. దీంతో జగన్ వెంటనే అతడి సమస్యపై స్పందించి.. అతనికి ఉద్యోగం ఏర్పాటు […]
73వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం చివర్లో ఓ వ్యక్తి హఠాత్తుగా స్టేజ్‌పై సీఎం వద్దకు దూసుకెళ్లాడు. విజయవాడకు చెందిన కోలా దుర్గారావు అనే వ్యక్తి గతంలో కరెంట్ షాక్‌తో తన రెండు చేతులూ కోల్పోయానని.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి.. ఇవ్వలేదని జగన్ వద్ద వాపోయారు. దీంతో జగన్ వెంటనే అతడి సమస్యపై స్పందించి.. అతనికి ఉద్యోగం ఏర్పాటు చేయాలని తన కార్యదర్శి ధనుంజయ రెడ్డిని ఆదేశించారు. కాగా.. ఈ ఘటన నేపథ్యంలో సీఎంకు గల సెక్యూరిటీ లోపంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.