AP Weather Report: బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం.. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

| Edited By: Anil kumar poka

Nov 01, 2021 | 4:02 PM

బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది...

AP Weather Report: బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం.. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
Weather Update
Follow us on

బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాగల 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతం మీదకు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర వాయవ్యంగా ప్రయాణించి మరింత బలపడుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం:
ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రేపు కూడా ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:
ఈరోజు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలుచాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రేపు, రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలచోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read Also.. MLA Roja: తగ్గేదెలే.. విద్యార్థులతో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా.. వీడియోలు వైరల్‌..