AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. పవన్ కళ్యాన్‌‌పై సంచలన కామెంట్స్ చేసిన ఏపీ మంత్రి..

Andhra Pradesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‌పై రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకునే సంకేతాలు ఉన్నాయని..

Andhra Pradesh: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. పవన్ కళ్యాన్‌‌పై సంచలన కామెంట్స్ చేసిన ఏపీ మంత్రి..
Seediri Appalaraju
Shiva Prajapati
|

Updated on: Nov 01, 2021 | 3:36 PM

Share

Andhra Pradesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‌పై రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకునే సంకేతాలు ఉన్నాయని, ఇలాంటి తరుణంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేపడుతున్న పోరాటానికి పవన్ కళ్యాణ్ మద్ధతు తెలుపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ఆరు నెలలుగా విశాఖ ఉక్కు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. సోమవారం నాడు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన మంత్రి అప్పలరాజు.. ఇప్పుడొచ్చి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఈ ఆరు నెలల పాటు ఏ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఆరు నెలలుగా విశాఖ ఉక్కు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకొచ్చారు. మరి ఆయన ఏం చేశారో చెప్పాలన్నారు. సినిమా షూటింగ్‌లో బిజీనా, లేక విహార యాత్రలో బిజీగా ఉన్నారా? అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇవ్వడానికి పవన్‌కి ఉన్న అర్హత ఏంటని మంత్రి ప్రశ్నించారు. ఎక్కడ తమకు క్రెడిట్ దక్కుతుందో అన్న భయంతోనే నేడు సడన్‌గా ఊడిపడి.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేపడుతున్న పోరాటానికి సంఘీభావం తెలిపారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్టులు చదవడం మానుకొని, నీకు నీవుగా ఏమైనా విమర్శలు చేయగలవా? అంటూ పవన్‌ను ఎద్దేవా చేశారు మంత్రి అప్పలరాజు. పవన్ కళ్యాణ్ ముందుగా దృతరాష్టుడి చెర నుంచి బయటపడే పనిలో ఉంటే మంచిదని హితవు చెప్పారు.

Also read:

Common Cold: చలికాలం వచ్చేస్తోంది.. జలుబు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు ఏమిటంటే..

T20 World Cup: భారత జట్టుకు మద్దతుగా పీటర్సన్.. ఆటగాళ్లకు అండగా నిలవాలని హిందీలో ట్వీట్..

Divya Bharti: దివంగత నటి దివ్య భారతి తండ్రి మృతి.. చివరి వరకు ఆమె భర్త దగ్గరే నివాసం..