AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా ఓటమికి మీరే కారణం.. జన సైనికులపై పవన్ అసహనం..!

‘మీరు సరిగ్గా లేకే నేను ఓడిపోయా’ అంటూ జన సైనికులను జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మాట్లాడిన పవన్.. ఫ్యాన్స్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై పవన్ మాట్లాడే సమయంలో ఫ్యాన్స్ అరుపులు, కేకలు వేశారు. దీంతో కాస్త ఇబ్బందికి ఫీల్ అయిన ఆయన.. జనసేన కోసం మీరు సైనికులే. కానీ మీరు ఇట్లా చేయకూడదు కదా. […]

నా ఓటమికి మీరే కారణం.. జన సైనికులపై పవన్ అసహనం..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 08, 2019 | 8:08 PM

Share

‘మీరు సరిగ్గా లేకే నేను ఓడిపోయా’ అంటూ జన సైనికులను జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మాట్లాడిన పవన్.. ఫ్యాన్స్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై పవన్ మాట్లాడే సమయంలో ఫ్యాన్స్ అరుపులు, కేకలు వేశారు. దీంతో కాస్త ఇబ్బందికి ఫీల్ అయిన ఆయన.. జనసేన కోసం మీరు సైనికులే. కానీ మీరు ఇట్లా చేయకూడదు కదా. అరవొద్దు దయచేసి. నిజంగా ఇబ్బందిగా ఉంది నాకు. క్రమశిక్షణ లేని వారు మీరు ఏం చేయలేరు. మీరు సరిగ్గా లేకపోవడం వల్లే నేను ఓడిపోవల్సి వచ్చింది. అది మర్చిపోకండి. నిజంగా ఇబ్బందిగా ఉంది నాకు మీతోటి. ఎందుకుంటే మీకు క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ ఉండుంటే జనసేన గెలిచుండేది. ప్రత్యర్థులు, శత్రువులు దెబ్బ కొడతారు. మీకేమో క్రమశిక్షణ లేదు అని వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలోనూ ఫ్యాన్స్ అరుపులు, కేకలు ఆగకపోగా.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఇదే సభలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు పవన్. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆయన దుయ్యారబట్టారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే మూడు రోజుల్లో రైతులకు లాభసాటి లేదా గిట్టుబాటు ధర కల్పించాలని.. లేదంటే తాను కాకినాడలో 24గంటల దీక్షకు కూర్చుంటానని అన్నారు. రైతు కన్నీరు పెట్టే రాజ్యం సుభిక్షంగా ఉండదని.. రైతు కన్నీరు రాష్ట్రానికి శాపం అవుతుందని ఆయన విమర్శించారు. పాదయాత్రలు చేసి ముద్దులు పెడితే రైతుల కడుపు నిండదని పవన్ ఈ సందర్భంగా కామెంట్లు చేశారు.

Follow Us
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు