Amaravati Farmers Maha Padayatra: అమరావతిని రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన అరసవెల్లి వరకు చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు చేరుకుంది. పన్నెండో రోజు యాత్రలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రజాయాత్రగా కొనసాగుతోందని నారాయణ అన్నారు. ఈ యాత్రలో కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు పాల్గొంటున్నారని నారాయణ అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు రాజధానికి సంబంధించి 75 శాతం పనులు పూర్తి చేశారని నారాయణ అన్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణం పూర్తైన విషయాన్ని నారాయణ గుర్తు చేశారు.
మరో వైపు ఈ యాత్ర చంద్రబాబు స్పాన్సర్డ్ యాత్ర అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. ఆయన అధికారంలోకి వచ్చేందుకే కొందరు ఈ పాదయాత్రను చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. దీనిపై చర్చించేందుకు ఈ ఆదివారం విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..