తండ్రి చితి ఆరకముందే బాబాయికి కట్టబెట్టారంటూ..సంచయిత సంచలన ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై మాన్సాస్ ('మహారాజా అలోక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్) ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత సంచలన ఆరోపణలు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులు అన్యాక్రాంతం కావడానికి

తండ్రి చితి ఆరకముందే బాబాయికి కట్టబెట్టారంటూ..సంచయిత సంచలన ఆరోపణలు..
Follow us

|

Updated on: Jun 04, 2020 | 5:38 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై మాన్సాస్ (‘మహారాజా అలోక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్) ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత సంచలన ఆరోపణలు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులు అన్యాక్రాంతం కావడానికి అశోక్ గజపతిరాజు చర్యలే కారణమని ఆరోపించారు. ”ఆనందగజపతిరాజుగారి పెద్దబిడ్డగా, ఆయన వారసురాలిగా మాన్సాస్‌ బాధ్యతలను చేపట్టానన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. మా తండ్రి చితి ఆరకముందే మీరు, మా బాబాయ్‌.. అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా జీవో జారీ చేసి, ట్రస్టుని కట్టబెట్టారంటూ” ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.

మన్సాన్ ట్రస్టు చైర్మన్ గా అశోక్‌ గజపతిరాజు పదవీకాలంలో అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుని, ట్రస్టును ఆర్థికంగా నష్టపోయేలా చేశారని, విద్యాసంస్థల్లో నాణ్యత పడిపోయిందని ఆరోపించారు. ట్రస్టు భూములు కబ్జాలకు గురవుతుంటే ఆ కేసులను వాదించడానికి కనీసం లాయర్‌ని కూడా నియమించలేదని వ్యాఖ్యానించారు. విశాఖ అడిషనల్ జిల్లా జడ్జి తీర్పే ఇందుకు ఉదాహరణ అంటూ సంచయిత ట్విట్ చేశారు. మాన్సాస్ లా కాలేజీ క్యాంపస్‌ను ఐఎల్ఎఫ్ఎస్‌కు ఉచితంగా ఇచ్చేశారని, విద్యార్థులను షెడ్డుల్లోకి మార్చారని అన్నారు. చివరకు ఐఎల్ఎఫ్ఎస్ ఎలాంటి కుంభకోణంలో ఇరుక్కుందో జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. చంద్రబాబుగారు తన సహచరుడ్ని పొగిడేముందు మా తాతగారు, మా తండ్రిగారి వారసత్వాన్ని ఏ విధంగా ధ్వంసంచేశారో తెలుసుకోవాలన్నారు. లేదంటే, ఇవన్నీ మీకు తెలిసి, మీ ఇద్దరూ కలిసి చేసినవేనా అంటూ చంద్రబాబు, అశోక్ గజపతిరాజును ప్రశ్నిస్తూ ట్విట్ చేశారు.

[svt-event date=”04/06/2020,5:35PM” class=”svt-cd-green” ]

[/svt-event]