కౌలు రైతులకు శుభవార్త చెప్పిన జగన్
కౌలు రైతులకు ఏపీ సీఎం జగన్ శుభవార్తను అందించారు. వైఎస్ఆర్ రైతు భరోసా పధకం మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు చేస్తూ.. నియోజకవర్గ స్థాయిలో రాజ్యాంగ పదవులు పొందిన రైతు కుటుంబాలను మినహాయించి.. కౌలు రైతులు, అటవీ ప్రాంతానికి చెందిన ఎస్సి, ఎస్టి, బీసి, మైనార్టీ రైతులు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఈ పధకానికి అర్హులని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా అకాల మరణం చెందిన రైతుల కుటుంబాలకు కూడా రైతు భరోసా సాయం అందనుంది. ఇకపోతే రైతు భరోసా […]
కౌలు రైతులకు ఏపీ సీఎం జగన్ శుభవార్తను అందించారు. వైఎస్ఆర్ రైతు భరోసా పధకం మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు చేస్తూ.. నియోజకవర్గ స్థాయిలో రాజ్యాంగ పదవులు పొందిన రైతు కుటుంబాలను మినహాయించి.. కౌలు రైతులు, అటవీ ప్రాంతానికి చెందిన ఎస్సి, ఎస్టి, బీసి, మైనార్టీ రైతులు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఈ పధకానికి అర్హులని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా అకాల మరణం చెందిన రైతుల కుటుంబాలకు కూడా రైతు భరోసా సాయం అందనుంది.
ఇకపోతే రైతు భరోసా పధకం అర్హులందరికీ మే నెలలో రూ. 7500, అక్టోబర్‌లో రూ. 4 వేలు, జనవరిలో రూ. 2 వేలు చొప్పున మూడు విడతలుగా సాయం లభించనుంది. ఈ మేరకు పథకంలో సవరణలు చేసి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది.