AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జేసీ ఫ్యామిలీకి మరో షాక్.. హైకోర్టు నోటీసులు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్‌స్టోన్ మైనింగ్ లీజ్ విషయంలో జేసీ కుమారుడు పవన్ రెడ్డి, కోడలు సంయుక్తారెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు త్రిశూల్ సిమెంట్ సంస్థలు, వ్యాపార భాగస్వామి వేణుగోపాల్ రెడ్డికి కూడా కోర్టు నోటీసులిచ్చింది. ఈ కేసులో మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన […]

జేసీ ఫ్యామిలీకి మరో షాక్.. హైకోర్టు నోటీసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 27, 2019 | 1:31 PM

Share

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్‌స్టోన్ మైనింగ్ లీజ్ విషయంలో జేసీ కుమారుడు పవన్ రెడ్డి, కోడలు సంయుక్తారెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు త్రిశూల్ సిమెంట్ సంస్థలు, వ్యాపార భాగస్వామి వేణుగోపాల్ రెడ్డికి కూడా కోర్టు నోటీసులిచ్చింది. ఈ కేసులో మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కు వాయిదా వేసింది.

అయితే సున్నపురాయి మైనింగ్ లీజు కోసం త్రిశూల్ సిమెంట్ కంపెనీ మోసాలకు పాల్పడిందని, దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ 2011లో తాడిపత్రికి చెందిన వి.మురళీ ప్రసాదర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు. ఇక ఈ కేసును విచారిస్తోన్న హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జేసీ దివాకర్ రెడ్డి సహా త్రిశూల్ సంస్థ నిర్వహణ భాగస్వామి ఎస్ హుస్సేన్ భాషా, ఎస్. గోపాలరావు, తిమ్మాపురం దేవపుత్రుడు, జె. నాగ సుబ్బరాయుడు, కె. సిలాస్‌లకు నోటీసులిచ్చింది. ఇదే కేసులో తాజాగా జేసీ కుమారుడు, కోడలికి నోటీసులు అందాయి.

Follow Us
అస్సాంలో ఘోర ప్రమాదం.. 10 మంది స్టూడెంట్స్ మృతి!
అస్సాంలో ఘోర ప్రమాదం.. 10 మంది స్టూడెంట్స్ మృతి!
ఈ వారం మారిపోబోతోంది మీ జాతకం.. ఈ రాశుల వారికి కాసుల వర్షం!
ఈ వారం మారిపోబోతోంది మీ జాతకం.. ఈ రాశుల వారికి కాసుల వర్షం!
వాస్తు టిప్స్ : ఇంట్లోకి కప్ప రావడం శుభమా? అశుభమా?
వాస్తు టిప్స్ : ఇంట్లోకి కప్ప రావడం శుభమా? అశుభమా?
ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుఫాన్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుఫాన్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
భారత్ సమ్మిట్‌ చుట్టూ తెలంగాణ రాజకీయం.. నేతల మాటల తూటాలు..
భారత్ సమ్మిట్‌ చుట్టూ తెలంగాణ రాజకీయం.. నేతల మాటల తూటాలు..
విల్ యంగ్ సెంచరీ వృథా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ ఎవరికి దక్కిందంటే ?
విల్ యంగ్ సెంచరీ వృథా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ ఎవరికి దక్కిందంటే ?
కేవలం రూ.3.50 లక్షలకే ఫ్లాట్.. ప్రజలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.
కేవలం రూ.3.50 లక్షలకే ఫ్లాట్.. ప్రజలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్.
దారుణంగా ఉన్నావ్ అని రిజెక్ట్ చేశాడు.. కట్ చేస్తే
దారుణంగా ఉన్నావ్ అని రిజెక్ట్ చేశాడు.. కట్ చేస్తే
ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా ఇత్తడి వస్తువులను కొత్తవాటిలా మార్చండి
ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా ఇత్తడి వస్తువులను కొత్తవాటిలా మార్చండి
ఒంట్లో వేడి ఎక్కువయ్యి యూరిన్ రాని వాళ్ళు.. ఈ వడలు రెండు తినండి
ఒంట్లో వేడి ఎక్కువయ్యి యూరిన్ రాని వాళ్ళు.. ఈ వడలు రెండు తినండి