Narasaraopeta: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ,టీడీపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగడంతో నర్సారావుపేట రణరంగంగా మారింది. టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబు ఇంటిపై దాడి చేశారు. పోలీసులు స్పాట్‌కి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇంతకీ, గొడవకు కారణమేంటి..? పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంటిపై కొందరు దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిలో చల్లా సుబ్బారావు ఇంటి కిటికీలు, ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. కోటప్పకొండ రోడ్డులో ఉన్న ఆ ఇంటిని సుబ్బారావు ఆక్రమించారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. దాడి సమాచారం తెలుసుకుని టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి భారీగా చేరుకోవడంతో..ఇరు వర్గాల వారు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు.
ఇక ఈ దాడిలో పోలీసు జీపు సహా టీడీపీ నేతలు కడియాల రమేశ్, అరవిందబాబు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడిలో అరవిందబాబు కారు డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. పోలీసులు స్పాట్‌కి వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఆ ఏరియాలో భద్రతను పెంచారు. ఇదే సమయంలో నరసరావుపేట MLA గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కూడా స్పాట్‌కి వచ్చారు. చల్లా సుబ్బారావు అనే వ్యక్తి ఓ రౌడిషీటర్ అన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. సమస్య క్లియర్ చేయాల్సిందిపోయి, కర్రలతో దాడి చేసి సమాజానికి ఏం మేసెజ్ ఇవ్వాలనుకుంటున్నారని మండిపడ్డారు.
కాగా, ఇలాంటి ఘటనలకు పాల్పడ్డవారిని నరసరావుపేట నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు MLA గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. ఇంకా ఈ గొడవకు టీడీపీ నేత అరవింద్ బాబే కారణమని ఆరోపిప్తున్నారు బాధితులు.మరోవైపు ఈ గొడవకు కారణం వైసీపీ నేతలే కారణమని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే తమ తప్పేంలేదని, దౌర్జన్యాలు, హత్యలు చేయడం టీడీపీ శ్రేణులకు అలవాటేనంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి ఇరువర్గాల మధ్య దాడి పల్నాటి యుద్ధాన్ని తలపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..