AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేదం.. సీఎం జగన్ ఆదేశాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులుగా విధులు నిర్వహిస్తూ ప్రైవేటు హాస్పిటళ్లు నడుపుతూ ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు ఏపీ ప్రభుత్వం షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చింది. వారు చేస్తున్న ప్రైవేటు ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ ఆదేశించారు సీఎం జగన్. వీరికి ఆమేరకు జీతాలు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో సంస్కరణలు చేపట్టే దిశగా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు […]

ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేదం.. సీఎం జగన్ ఆదేశాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 19, 2019 | 2:22 AM

Share

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులుగా విధులు నిర్వహిస్తూ ప్రైవేటు హాస్పిటళ్లు నడుపుతూ ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు ఏపీ ప్రభుత్వం షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చింది. వారు చేస్తున్న ప్రైవేటు ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ ఆదేశించారు సీఎం జగన్. వీరికి ఆమేరకు జీతాలు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వైద్య ఆరోగ్యశాఖలో సంస్కరణలు చేపట్టే దిశగా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈకమిటీ తన నివేదికను సీఎం జగన్‌‌కు సమర్పించారు. ఈ నివేదికలో దాదాపు 100 సిఫార్సులు చేశారు. వీటిలో గత ప్రభుత్వం చేసిన పలు ఒప్పందాల్లో లోపాలు కూడా కమిటీ బయటపెట్టింది. వీటన్నిటిపై చర్చించిన సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగి విధంగా నడుచుకోవాలని, అందుకు తగ్గట్టుగా ఆస్పత్రుల్లో ఫ్యాన్లు, లైట్లు, బాత్‌రూమ్‌లు, ఫ్లోరింగులు, గోడలతో పాటు మంచాలు, దుప్పట్లు అన్నీ మార్చాలని, అవసరమైన చోట ఏసీలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ప్రభుత్వాసుపత్రుల దశ, దిశ మారుస్తామని, సిబ్బంది కొరత లేకుండా సదుపాయాలు పెంచాలని కూడా ఆయన ఆదేశించారు.

వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ

ఎన్నికల మేనిఫెస్టోను తూచ తప్పకుండా అమలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆస్పత్రులతో సూపర్ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేయాలని, ఇది నవంబర్ 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అదే విధంగా సీఎం జగన్ జన్మదినం డిసెంబర్ 21 నుంచి ఆరోగ్య కార్డుల జారీని ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే జాబితాలో ఉన్న వ్యాధులకు అదనంగా మరికొన్ని చేర్చుతూ ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. అదే విధంగా వైద్యం ఖర్చు వెయ్యి దాటితే దానికి ఆరోగ్యశ్రీ వర్తించేలా కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఆపరేషన్ చేయించుకున్న వారు కోలుకుంటున్న సమయంలో నెలకు రూ. 5 వేలు చొప్పున సహాయాన్ని చేయాలని కూడా సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే