విశాఖ సముద్రంలో అగ్నిప్రమాదం.. ఐదుగురికి గాయాలు
విశాఖలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విశాఖ హార్బర్ టగ్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో టగ్‌లో 20 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 15 మంది సురక్షితంగా తప్పించుకున్నట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.