AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిమ్నీ క్లీన్ చేయడం కష్టమా? అల్యూమినియం ఫాయిల్‌తో ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి..

వంటింట్లో వంట చేసేటప్పుడు వచ్చే పొగ, నూనె ఆవిర్లను పీల్చుకోవడానికి చిమ్నీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, రోజూ వాడటం వల్ల చిమ్నీ ఫిల్టర్లపై దట్టమైన నూనె పొరలు, మొండి జిడ్డు పేరుకుపోతుంటాయి. వీటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే చిమ్నీ పనితీరు తగ్గిపోవడమే కాకుండా దుర్గంధం రావడం ప్రారంభమవుతుంది. సాధారణంగా చిమ్నీ ఫిల్టర్లను కడగడం పెద్ద ప్రహసనంగా భావిస్తారు. కానీ, మన ఇంట్లో లభించే అల్యూమినియం ఫాయిల్‌తో ఈ పనిని చాలా సులభంగా పూర్తి చేయవచ్చని తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

చిమ్నీ క్లీన్ చేయడం కష్టమా? అల్యూమినియం ఫాయిల్‌తో ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి..
Aluminium Foil Chimney Cleaning Hack
Jyothi Gadda
|

Updated on: Aug 15, 2026 | 4:23 PM

Share

వంటింట్లో వంట చేసేటప్పుడు వచ్చే పొగ, నూనె ఆవిర్లను పీల్చుకోవడానికి చిమ్నీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, రోజూ వాడటం వల్ల చిమ్నీ ఫిల్టర్లపై దట్టమైన నూనె పొరలు, మొండి జిడ్డు పేరుకుపోతుంటాయి. వీటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే చిమ్నీ పనితీరు తగ్గిపోవడమే కాకుండా దుర్గంధం రావడం ప్రారంభమవుతుంది. సాధారణంగా చిమ్నీ ఫిల్టర్లను కడగడం పెద్ద ప్రహసనంగా భావిస్తారు. కానీ, మన ఇంట్లో లభించే అల్యూమినియం ఫాయిల్‌తో ఈ పనిని చాలా సులభంగా పూర్తి చేయవచ్చని తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇళ్లలో ఆహారాన్ని వెచ్చగా ఉంచడానికి, ప్యాకేజింగ్ కోసం అల్యూమినియం ఫాయిల్‌ను సాధారణంగా ఉపయోగిస్తారు. కానీ, దీనిని శుభ్రపరచడంతో సహా అనేక ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? అల్యూమినియం ఫాయిల్‌ను ఉపయోగించి చిమ్నీ ఫిల్టర్‌ను కూడా క్లీన్‌ చేయవచ్చని తెలిస్తే ఆశ్చర్యపోతారు. వంటగది చిమ్నీలలో పొగ, నూనె మరకలు, జిడ్డు పేరుకుపోతాయి. కాబట్టి, దానిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా ముఖ్యం. అల్యూమినియం ఫాయిల్‌తో శుభ్రపరిచే పూర్తి పద్ధతిని తెలుసుకుందాం…

అల్యూమినియం ఫాయిల్ హ్యాక్ ఎలా పనిచేస్తుంది?:

మొదట, చిమ్నీని ఆపివేసి, విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయండి. ఆ తర్వాత, చిమ్నీ ఫిల్టర్లు బయటకు తీయండి. గోరువెచ్చని నీరు, డిష్‌వాషింగ్ ద్రవం మిశ్రమంలో ఫిల్టర్‌ను 20 నిమిషాల పాటు నానబెట్టండి. తర్వాత, ఒక చిన్న అల్యూమినియం ఫాయిల్ ముక్కను తీసుకుని, అల్యూమినియం ఫాయిల్‌ను ఒక చిన్న బంతిలా లేదా ముక్కలా చుట్టుకోవాలి. ఫిల్టర్‌పై పేరుకుపోయిన మురికిపై సున్నితంగా రుద్దండి. పూత లేని ప్రదేశాలపై మాత్రమే అల్యూమినియం ఫాయిల్‌ను రుద్దేలా చూసుకోండి. ఇప్పుడు, ఫిల్టర్‌ను శుభ్రమైన నీటితో కడిగి, పూర్తిగా ఆరబెట్టండి. ఆరిన తర్వాత, ఫిల్టర్‌ను తిరిగి చిమ్నీలో భద్రపరచండి.

ఇవి కూడా చదవండి

అల్యూమినియం ఫాయిల్‌లో ఎటువంటి ప్రత్యేక రసాయనాలు ఉండవు. కానీ, గోరువెచ్చని నీరు, డిష్‌వాషింగ్ సోప్ మిశ్రమంలో ఫిల్టర్లను నానబెట్టినప్పుడు జిడ్డు వదులుగా మారుతుంది. ఆ సమయంలో అల్యూమినియం ఫాయిల్‌ను స్క్రబ్బర్‌లా ఉపయోగించి రుద్దినప్పుడు, అది ఫిల్టర్‌కు ఎటువంటి హాని చేయకుండానే మొండి మరకలను సులభంగా వేరు చేస్తుంది.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:

ఎక్కువ ఒత్తిడి పెట్టవద్దు: ఫాయిల్‌తో రుద్దేటప్పుడు ఎక్కువ బలం ఉపయోగించి రుద్ద కూడదు. అతిగా రుద్దితే ఫిల్టర్‌పై ఉండే ప్రత్యేక కోటింగ్ దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఎలక్ట్రానిక్ భాగాలు: నీరు లేదా అల్యూమినియం ఫాయిల్‌ను కేవలం తీసివేసిన మెటల్ ఫిల్టర్లకు మాత్రమే వాడాలి. చిమ్నీ మోటార్, స్విచ్‌బోర్డ్, వైరింగ్ ఉన్న భాగాలకు నీరు తగలకుండా జాగ్రత్త పడాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us