మోస్ట్‌ పాపులర్‌ సీఎంలు: 3వ స్థానంలో జగన్‌..5వ స్థానంలో కేసీఆర్

అమరావతి :  151 సీట్ల అత్యంత భారీ మెజార్టీతో ఏపీలో అధికారం దక్కించుకున్న వైసీపీ అధినేత జగన్ సీఎంగా తనదైన స్టైల్‌లో ముందుకు దూసుకెళ్తున్నారు. తన మార్క్ నిర్ణయాలతో పాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.  తాజాగా ఆయన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.  వీడీపీ అసోసియేట్స్‌ నిర్వహించిన సర్వేలో మోస్ట్‌ పాపులర్‌ సీఎంల జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 71 శాతం మంది సీఎం జగన్‌ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు ‘దేశ్‌ కా మూడ్‌’ […]

మోస్ట్‌ పాపులర్‌ సీఎంలు: 3వ స్థానంలో జగన్‌..5వ స్థానంలో కేసీఆర్
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 16, 2019 | 2:35 PM

అమరావతి :  151 సీట్ల అత్యంత భారీ మెజార్టీతో ఏపీలో అధికారం దక్కించుకున్న వైసీపీ అధినేత జగన్ సీఎంగా తనదైన స్టైల్‌లో ముందుకు దూసుకెళ్తున్నారు. తన మార్క్ నిర్ణయాలతో పాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.  తాజాగా ఆయన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.  వీడీపీ అసోసియేట్స్‌ నిర్వహించిన సర్వేలో మోస్ట్‌ పాపులర్‌ సీఎంల జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 71 శాతం మంది సీఎం జగన్‌ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు ‘దేశ్‌ కా మూడ్‌’ పేరిట చేపట్టిన సర్వేలో తేలినట్లు వీడీపీ అసోసియేట్స్‌ వెల్లడించింది. సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’  జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని ఈ సందర్భంగా సదరు సంస్థ ప్రస్తావించింది.

ఇక ఈ సర్వేలో  ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రథమ స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ రెండో స్థానంలో ఉన్నారు.  తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ఐదో స్థానంలో నిలిచారు.