జగన్ కేబినెట్: సామాజికవర్గాల వారీగా మంత్రి పదవులు

ఇప్పటికే తనదైన శైలితో ఏపీలో పరిపాలన సాగిస్తోన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తన కేబినెట్‌ను విస్తరించనున్నారు. ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్న ఏపీ కొత్త మంత్రులు.. తమ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇందుకోసం శుక్రవారం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుండగా.. అందులో కేబినెట్ కూర్పుపై జగన్ చర్చించనున్నారు. కాగా మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన కేబినెట్‌లో ఎవరెవరికి అవకాశం ఇస్తారా..? అన్న విషయంపై సర్వతా ఆసక్తి నెలకొంది. […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:31 pm, Thu, 6 June 19
జగన్ కేబినెట్: సామాజికవర్గాల వారీగా మంత్రి పదవులు

ఇప్పటికే తనదైన శైలితో ఏపీలో పరిపాలన సాగిస్తోన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తన కేబినెట్‌ను విస్తరించనున్నారు. ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్న ఏపీ కొత్త మంత్రులు.. తమ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇందుకోసం శుక్రవారం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుండగా.. అందులో కేబినెట్ కూర్పుపై జగన్ చర్చించనున్నారు. కాగా మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన కేబినెట్‌లో ఎవరెవరికి అవకాశం ఇస్తారా..? అన్న విషయంపై సర్వతా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సామాజిక వర్గాల వారీగా సీఎం జగన్ మంత్రి పదవులను నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెడ్డి-7, బీసీ-6, కాపు- 2, కమ్మ-2 ఎస్సీ మాల-2, ఎస్సీ మాదిగ-1, ఎస్టీ-1, క్షత్రియ-1, ముస్లిం మైనార్టీ-1, బ్రాహ్మణ-1, వైశ్య-1గా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా కేబినెట్‌లో మంత్రి పదవుల కోసం ఇప్పటికే పలువురు ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.