ఈ మాత్రం వరదలను మేనేజ్ చేయలేని మీరు..: బాబు ఫైర్
రాజధానిని, తన ఇంటిని ముంచేందుకే ఏపీ ప్రభుత్వం కృత్రిమ వరదను సృష్టించిందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. మూడు రోజుల పాటు శ్రీశైలం, సాగర్‌లో నీరు నిల్వచేసి ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక్కసారిగా నీరు వదిలారని ఆయన ఆరోపించారు. వరదలపై సీఎం ఒక్కసారి కూడా సమీక్ష జరపలేదని.. మంత్రులు, నేతలు తన ఇంటి చుట్టూనే తిరిగారని ఆయన అన్నారు. ఆగష్టు 7వరకు పోతిరెడ్డిపాడుకు నీరు ఎందుకు వదలలేదని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. […]
రాజధానిని, తన ఇంటిని ముంచేందుకే ఏపీ ప్రభుత్వం కృత్రిమ వరదను సృష్టించిందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. మూడు రోజుల పాటు శ్రీశైలం, సాగర్‌లో నీరు నిల్వచేసి ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక్కసారిగా నీరు వదిలారని ఆయన ఆరోపించారు. వరదలపై సీఎం ఒక్కసారి కూడా సమీక్ష జరపలేదని.. మంత్రులు, నేతలు తన ఇంటి చుట్టూనే తిరిగారని ఆయన అన్నారు. ఆగష్టు 7వరకు పోతిరెడ్డిపాడుకు నీరు ఎందుకు వదలలేదని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సూచించారు. ఈ మాత్రం వరదలను మేనేజ్ చేయలేకపోతే ప్రభుత్వంలో కొనసాగేందుకు మీరు అనర్హులు అంటూ బాబు దుయ్యారబట్టారు. పోతిరెడ్డిపాడుకు నీటిని మళ్లిస్తేనే తెలంగాణ ఓర్వలేదని, కృష్ణా వాటర్ రివర్స్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసిందని.. తెలంగాణ వైఖరిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కోడెలపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని ఈ సందర్భంగా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.