AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబుపై ఏపీ పోలీస్ సంఘం ఫైర్.. ఘాటు సమాధానం

పోలీసులను బెదిరించడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులను ఉద్దేశించి ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌లు చేసిన వ్యాఖ్యలను ఖండించిన పోలీస్ సంఘం రాష్ట్రాధ్యక్షుడు జనుకుల శ్రీనివాసరావు.

చంద్రబాబుపై ఏపీ పోలీస్ సంఘం ఫైర్.. ఘాటు సమాధానం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 28, 2020 | 5:18 PM

Share

పోలీసులను బెదిరించడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులను ఉద్దేశించి ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌లు చేసిన వ్యాఖ్యలను ఖండించిన పోలీస్ సంఘం రాష్ట్రాధ్యక్షుడు జనుకుల శ్రీనివాసరావు.. బెదిరింపులు మానుకోవాలని హితవు పలికారు. అయితే గురువారం విశాఖ పర్యటనకు వెళ్లిన చంద్రబాబును అక్కడి వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారి తీరును నిరసిస్తూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో భద్రత దృష్ట్యా చంద్రబాబు తిరిగి వెళ్లాలని పోలీసులు కోరారు. అయితే పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు గాడిదలు కాస్తున్నారా..? అంటూ మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలను ఖండించిన జనకుల శ్రీనివాసరావు.. పోలీసులు కాస్తున్నది శాంతి భద్రతలను.. గాడిదలను కాదని పేర్కొన్నారు. చంద్రబాబు భద్రత కోసమే పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారని అన్నారు. అయినా పోలీసులను బెదిరించడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని.. పోలీసులపై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు, లోకేష్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులను బెదిరించడం మానుకోవాలి.

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?