ఓపెన్ మార్కెట్‌ ద్వారా రుణం.. ఏపీకి కేంద్ర అనుమతి

ఓపెన్ మార్కెట్ రూ.20వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఏపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. దీంతో ఈ నెల 25న రూ.2వేల కోట్ల రుణం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అప్పులను ఉత్పాదక, సంక్షేమ రంగాలకు ఖర్చు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే ఆర్బాటాలు, హంగుల కోసం ప్రజాధనాన్ని వృథా చేయొద్దని, ప్రతి పైసాను పొదుపుగా […]

ఓపెన్ మార్కెట్‌ ద్వారా రుణం.. ఏపీకి కేంద్ర అనుమతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 22, 2019 | 3:25 PM

ఓపెన్ మార్కెట్ రూ.20వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఏపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. దీంతో ఈ నెల 25న రూ.2వేల కోట్ల రుణం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అప్పులను ఉత్పాదక, సంక్షేమ రంగాలకు ఖర్చు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే ఆర్బాటాలు, హంగుల కోసం ప్రజాధనాన్ని వృథా చేయొద్దని, ప్రతి పైసాను పొదుపుగా వాడాలని, తెచ్చిన అప్పులను ఉత్పాదక రంగాలకు, పేదల సంక్షేమానికే ఖర్చు చేయాలని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు.

అయితే ఓపెన్‌ మార్కెట్‌లో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం ద్వారా ప్రతినెలా అవసరానికి అనుగుణంగా కొంతమేర రుణాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ సమీకరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓపెన్‌ మార్కెట్‌ నుంచి రూ.32,000 కోట్ల రుణం పొందడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గత టీడీపీ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తొలి త్రైమాసికానికి రూ.8,104 కోట్ల రుణం చేసేందుకు మాత్రమే అనుమతించింది. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.20,863 కోట్ల రుణం కోసం తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది.

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.