అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్

ఏపీ రాజధాని అమరాతిలో ‘బసవతారకం’పేరుమీద క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నటులు బాలకృష్ణ దంపతులు. అమ్మగారి జ్ఞాపకార్థం ఈ హాస్పిటల్ ను అమరావతిలో కూడా నిర్మిస్తుండటం ఆనందంగా ఉందని బాలకృష్ణ తెలిపారు. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు ఏపీలోనూ సేవలందించాలనే ఉద్దేశంతో ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు బాలకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాలలో ఈ హాస్పిటల్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు బాలకృష్ణ. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అతిథిగా పాల్గొన్నారు. స్పీకర్ […]

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్

ఏపీ రాజధాని అమరాతిలో ‘బసవతారకం’పేరుమీద క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నటులు బాలకృష్ణ దంపతులు. అమ్మగారి జ్ఞాపకార్థం ఈ హాస్పిటల్ ను అమరావతిలో కూడా నిర్మిస్తుండటం ఆనందంగా ఉందని బాలకృష్ణ తెలిపారు. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు ఏపీలోనూ సేవలందించాలనే ఉద్దేశంతో ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు బాలకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాలలో ఈ హాస్పిటల్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు బాలకృష్ణ. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అతిథిగా పాల్గొన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద రావు, ప్రముఖ డాక్టర్ దత్తాత్రేయుడు నోరి, మంత్రులు నారా లోకేష్ దంపతులు, నక్కా ఆనందబాబు, ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Published On - 12:51 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu