ఆ రోజున ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ సేవలు బంద్‌

ఈ నెల 30న ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ సేవలు బంద్‌ కానున్నాయి. ఆన్‌లైన్‌ టికెట్‌ రిజర్వేషన్‌ వ్యవస్థను ఏపీఎస్‌ఆర్టీసీ ఆధునీకరిస్తుండటంతో ఆ రోజు వెబ్‌సైట్‌ సేవలు తాత్కాలికంగా ఆగిపోనున్నాయి.

ఆ రోజున ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ సేవలు బంద్‌
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2020 | 10:13 PM

ఈ నెల 30న ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ సేవలు బంద్‌ కానున్నాయి. ఆన్‌లైన్‌ టికెట్‌ రిజర్వేషన్‌ వ్యవస్థను ఏపీఎస్‌ఆర్టీసీ ఆధునీకరిస్తుండటంతో ఆ రోజు వెబ్‌సైట్‌ సేవలు తాత్కాలికంగా ఆగిపోనున్నాయి. కాగా కరోనా నేపథ్యంలో అన్ని బస్సుల్లో రిజర్వేషన్‌ టికెట్ వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగదు రహిత, కాంటాక్ట్ లెస్‌ టికెటింగ్‌ వ్యవస్థను తీసుకు వచ్చే విధంగా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఒకేసారి 50 వేల మంది సేవలు పొందేలా వెబ్‌సైట్‌ను ఆధునీకరిస్తుండటంతో ఈ నెల 30న తాత్కాలికంగా వెబ్‌సైట్‌ సర్వర్‌ను నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. 30న రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 వరకు టికెట్ బుకింగ్‌లు, రద్దు సౌకర్యం ఉండదని అధికారులు తెలిపారు.