నా తప్పేం లేదు సీఎం గారూ- కోడెల
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో సభాపతి కోడెల శివప్రసాదరావు బుధవారం భేటీ అయ్యారు. పోలింగ్ రోజున గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్లలో తనపై జరిగిన దాడి ఘటన గురించి సీఎంకు ఆయన వివరించారు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు, వైసీపీ నేతల ఫిర్యాదులను చంద్రబాబుకు వివరించారు. ఇనిమెట్ల ఘటనపై మంగళవారం కోడెలపై కేసు నమోదు అయ్యింది. రాజుపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ చేశారు. కోడెల ఎన్నికల రోజు బూత్ ఆక్రమణకు పాల్పడ్డరని వైసీపీ నేతలు […]
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో సభాపతి కోడెల శివప్రసాదరావు బుధవారం భేటీ అయ్యారు. పోలింగ్ రోజున గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్లలో తనపై జరిగిన దాడి ఘటన గురించి సీఎంకు ఆయన వివరించారు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు, వైసీపీ నేతల ఫిర్యాదులను చంద్రబాబుకు వివరించారు. ఇనిమెట్ల ఘటనపై మంగళవారం కోడెలపై కేసు నమోదు అయ్యింది. రాజుపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ చేశారు. కోడెల ఎన్నికల రోజు బూత్ ఆక్రమణకు పాల్పడ్డరని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో కోడెలను 7వ నిందితునిగా చేర్చిన పోలీసులు. ఆయనతో సహ మరో 22మంది టీడీపీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వైసీపీ అధినేత జగన్.. గవర్నర్‌కు సైతం దీనిపై ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రితో కోడెల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో కళా వెంకట్రావు, నక్కా ఆనంద్‌బాబు, దేవినేని ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు.