AP Inter Exams: విద్యార్థులకు శుభవార్త.. ఇకపై ఇంటర్‌లో గ్రేడింగ్‌తో పాటు మార్కులు.. 

|

Feb 27, 2020 | 3:37 PM

ఇక నుంచి ఇంటర్‌లో గ్రేడింగ్‌తో పాటు మార్కులను కూడా ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్.. చుట్టుపక్కల ఉండే జిరాక్స్ షాప్స్‌ను మూసివేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

AP Inter Exams: విద్యార్థులకు శుభవార్త.. ఇకపై ఇంటర్‌లో గ్రేడింగ్‌తో పాటు మార్కులు.. 
Follow us on

AP Inter Exams: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇక నుంచి ఇంటర్‌లో గ్రేడింగ్‌తో పాటు మార్కులను కూడా ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఆయన బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం 1411 కేంద్రాలను.. అలాగే 10వ తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,900 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని.. అంతేకాకూండా వాటి చుట్టుపక్కల ఉండే జిరాక్స్ షాప్స్‌ను మూసివేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అటు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో కేటాయిస్తామని తెలిపారు.

Also Read: జేఎన్‌టీయూ కీలక నిర్ణయం.. ఇకపై బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి..

మరోవైపు పదవ తరగతి పరీక్షల్లో స్వల్ప మార్పులు చేయడం వల్ల.. వాటికి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇక ప్రతీ విద్యార్థి హల్ టికెట్‌పైనా క్యూఆర్ కోడ్ ఉంటుందని.. పరీక్షా కేంద్రాల దగ్గర ఆ హల్ టికెట్‌ను తనిఖీ చేస్తారని చెప్పారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. చీఫ్ సూపర్‌వైజర్ మినహాయించి మరెవరి దగ్గర మొబైల్ ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కాగా, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా ఇన్విజిలేటర్లుగా వినియోగించుకుంటామని ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

Also Read: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కీలక మ్యాచ్‌కు కోహ్లీ డౌటే.?

Also Read: శృంగార సర్వేలో షాకింగ్ న్యూస్.. మహిళలూ టాపేనట.!

మార్చి 4 నుంచి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10,64,442 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అలాగే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. సుమారు 6 లక్షల 30 వేల మంది పదో తరగతి ఎగ్జామ్స్ రాయనున్నారు.

Also Read: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ సీజన్‌కు కెప్టెన్‌గా వార్నర్..

Also Read: ఏటీఎంలలో రూ.2వేల నోట్లకు బదులు రూ.200.. కేంద్రం క్లారిటీ.!