Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

IND Vs NZ: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కీలక మ్యాచ్‌కు కోహ్లీ డౌటే.?

వచ్చే నెలలో బంగ్లాదేశ్‌లోని ఢాకా స్టేడియం వేదికగా ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ జట్లు మధ్య జరగనున్న రెండు టీ20ల సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండదని తెలుస్తోంది.
IND Vs NZ, IND Vs NZ: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కీలక మ్యాచ్‌కు కోహ్లీ డౌటే.?
IND Vs NZ: వచ్చే నెలలో బంగ్లాదేశ్‌లోని ఢాకా స్టేడియం వేదికగా ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ జట్లు మధ్య జరగనున్న రెండు టీ20ల సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండదని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లను మార్చి 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇరు జట్లను కూడా ప్రకటించేశారు.ఈ సిరీస్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీ20 స్పెషలిస్ట్ కేఎల్ రాహుల్‌లు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం ఉంది. అయితే దానిపై కూడా అఫీషియల్‌గా క్లారిటీ రాలేదు. అయితే ఇండియా నుంచి ఇప్పటికే నలుగురు ఆటగాళ్ల అందుబాటులో ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శిఖర్ ధావన్, మహ్మద్ షమీలు బంగ్లాదేశ్ రానున్నారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజముల్ హాసన్ వెల్లడించారు.
Also Read: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ సీజన్‌కు కెప్టెన్‌గా వార్నర్..Also Read: ఏటీఎంలలో రూ.2వేల నోట్లకు బదులు రూ.200.. కేంద్రం క్లారిటీ.!

అటు వరల్డ్ ఎలెవన్ జట్టులో సఫారీ జట్టు నుంచి డుప్లెసిస్, ఎంగిడిలు పాల్గొనుండగా..  ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెయిర్ స్టో, హేల్స్, రషీద్‌, వెస్టిండీస్ ప్లేయర్లు గేల్, పూరన్, కీరన్ పొలార్డ్, కొట్రెల్.. ఇక జింబాబ్వే, న్యూజిలాండ్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

కాగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అయితే తమకు కోహ్లీ కావాలని పట్టుబట్టింది. మరి బీసీసీఐ దానికి అంగీకారం ఇస్తుందో.. కోహ్లీ ఆ ఒక్క మ్యాచ్ అయినా ఆడతాడో లేదో చూడాల్సిందే.

ఆసియా ఎలెవ‌న్: విరాట్ కోహ్లీ(ఒక్క మ్యాచ్ మాత్రమే, కానీ స్పష్టత లేదు), లోకేశ్ రాహుల్‌(ఓన్లీ వన్ గేమ్, నో క్లారిటీ), శిఖ‌ర్ ధావ‌న్‌, రిష‌బ్ పంత్‌, మహ్మ‌ద్ ష‌మీ, కుల్దీప్ యాద‌వ్‌, త‌మీమ్ ఇక్బాల్‌, లిట‌న్ దాస్‌, ముష్ఫికుర్ ర‌హీమ్‌, ముస్తాఫిజుర్ ర‌హ్మాన్‌, ల‌సిత్ మ‌లింగా, తిసార పెరీరా, ర‌షీద్ ఖాన్‌, ముజీబుర్ ర‌హీమ్‌, సందీప్ లామిచానే.

వరల్డ్ ఎలెవన్: డుప్లెసిస్(కెప్టెన్), హేల్స్, గేల్, పూరన్, బ్రెండన్ టేలర్, జానీ బెయిర్ స్టో, కీరన్ పొలార్డ్, రషీద్, కొట్రెల్, ఎంగిడి, టై, మెక్లినగాన్

Related Tags