ఏపీ: డిసెంబర్ 1 నుంచి బియ్యం డోర్ డెలివరీ…
క్వాలిటీ బియ్యం డోర్ డెలివరీపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బియ్యం కార్డు ఉన్న పేదవారికి నాణ్యమైన స్టోర్టెక్స్ బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది.
Quality Rice Distribution: క్వాలిటీ బియ్యం డోర్ డెలివరీపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బియ్యం కార్డు ఉన్న పేదవారికి నాణ్యమైన స్టోర్టెక్స్ బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ డోర్ డెలివరీల విషయంలో 9,260 వాహనాలను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..
స్వయం ఉపాధి పధకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు.. ఈ బియ్యం ఇంటింటికీ డోర్ డెలివరీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. కాగా, ఈ వాహనాలకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం లోన్ గా సర్కార్ అందించనుంది. ఇక మిగిలిన పది శాతం డబ్బును చెల్లించి యువత వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. కాగా, డిసెంబర్ 1 నుంచి ఈ పధకం అమలులోకి రానుండగా.. ఏడాదికి రూ. 776.45 కోట్లు మంజూరు చేసింది.
Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..