AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో చిల్డ్ బీర్ చెల్లదిక.. రూపాయి అద్దెకే లిక్కర్ షాప్!

మందుబాబులకు బ్యాడ్ న్యూస్. చల్లని బీరుతో వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అనుకునేవారికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఏపీలో చల్లటి బీర్లు అందుబాటులో ఉండవని తెలుస్తోంది. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం దశల వారీగా నిర్ణయాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా మొదటి దెబ్బ బీర్ల అమ్మకాలపై పడింది. చల్లటి బీర్లను ఆపేసి ఇకపై లిక్కర్ తరహాలోనే వాటిని కూడా అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. చల్లని బీర్లకు […]

ఏపీలో చిల్డ్ బీర్ చెల్లదిక.. రూపాయి అద్దెకే లిక్కర్ షాప్!
Ravi Kiran
|

Updated on: Aug 25, 2019 | 12:41 PM

Share

మందుబాబులకు బ్యాడ్ న్యూస్. చల్లని బీరుతో వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అనుకునేవారికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఏపీలో చల్లటి బీర్లు అందుబాటులో ఉండవని తెలుస్తోంది. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం దశల వారీగా నిర్ణయాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా మొదటి దెబ్బ బీర్ల అమ్మకాలపై పడింది. చల్లటి బీర్లను ఆపేసి ఇకపై లిక్కర్ తరహాలోనే వాటిని కూడా అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

చల్లని బీర్లకు ఇక చెల్లు..

ఏపీ ప్రభుత్వం ఎక్సైజ్ విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చే కొత్త మద్యం విధానంలో ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో అనేక మార్పులు చేస్తోంది. అందులో భాగంగా కొత్తగా అమలు కానున్న మద్యం విధానంలో చల్లటి బీర్లకు ప్రభుత్వం స్వస్తి చెప్పనుంది. ప్రభుత్వం రన్ చేసే మద్యం షాపుల్లో బీరు బాటిళ్లను కూల్‌ చేసే ఫ్రిడ్జ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది.

మద్య దుకాణం అద్దె ఒక్క రూపాయి…

ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి నిర్వహించనున్న మద్యం షాపులను ఒక్క రూపాయికే అద్దెకు ఇచ్చేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నారట. శనివారం ఈమేరుకు  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అద్దె షాపుల ఎంపికకు టెండర్లు నిర్వహించగా.. అందరూ పోటీపడి మరి అతి తక్కువ ధరకే దుకాణాలు అద్దెకిచ్చేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఏలూరుతో పాటు చుట్టు పక్కల ఉన్న పలు గ్రామాలు మద్యం దుకాణాలను ఒక్క రూపాయికే ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వనున్నారని సమాచారం.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..