కోర్టుకు హాజరైన ఏపీ డీజీపీ

హైకోర్టుకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. సీజ్ చేసిన వాహనాల విషయంలో పోలీస్ అధికారులు నిబంధనలు పాటించలేదని.. న్యాయ సలహాదారుల పనితీరు బాగాలేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వ సహాయ న్యాయవాదితో ఫైల్ చేయించడం సరికాదని తెలిపింది. వాహనాలు సీజ్ చేసిన మూడు రోజుల్లో డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ ముందు ప్రవేశపెట్టాలని, వెంటనే వాహన దారులు ఎక్సైజ్ కమిషనర్ […]

కోర్టుకు హాజరైన ఏపీ డీజీపీ
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 24, 2020 | 2:27 PM

హైకోర్టుకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. సీజ్ చేసిన వాహనాల విషయంలో పోలీస్ అధికారులు నిబంధనలు పాటించలేదని.. న్యాయ సలహాదారుల పనితీరు బాగాలేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వ సహాయ న్యాయవాదితో ఫైల్ చేయించడం సరికాదని తెలిపింది.

వాహనాలు సీజ్ చేసిన మూడు రోజుల్లో డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ ముందు ప్రవేశపెట్టాలని, వెంటనే వాహన దారులు ఎక్సైజ్ కమిషనర్ ముందు అప్లికేషన్ పెట్టుకోవచ్చుని న్యాయస్థానం పేర్కొంది. ఎక్సైజ్ కమిషనర్ మూడు రోజుల్లో సీజ్ చేసిన వాహనాలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.  అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై డీజీపీని కోర్టుకు హాజరు కావాలని ఆదేశించిన విషయం తెలిసిందే.