ముస్లింలకు జగన్ రంజాన్ కానుక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగిపోతున్నారు.  గత మూడురోజుల్లోనే అధికారుల బదీలీలు, కొత్తవారి నియామకం, శాఖలపై సమీక్షలు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా రంజాన్ పండగ నేపథ్యంలో ముస్లీం సోదరులకు శుభవార్త అందించారు ఏపీ కొత్త సీఎం. రంజాన్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. మసీదులు, ఈద్గాల్లో మరమ్మతులు, రంగులు వేయడం కోసం ప్రభుత్వం తరపున రూ.5 […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:47 pm, Sat, 1 June 19
ముస్లింలకు జగన్ రంజాన్ కానుక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగిపోతున్నారు.  గత మూడురోజుల్లోనే అధికారుల బదీలీలు, కొత్తవారి నియామకం, శాఖలపై సమీక్షలు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా రంజాన్ పండగ నేపథ్యంలో ముస్లీం సోదరులకు శుభవార్త అందించారు ఏపీ కొత్త సీఎం. రంజాన్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. మసీదులు, ఈద్గాల్లో మరమ్మతులు, రంగులు వేయడం కోసం ప్రభుత్వం తరపున రూ.5 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధులతో జిల్లాల్లో ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు.