వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష
పరిపాలనలో వేగాన్ని పెంచిన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచి మంచి ఫలితాలు సాధించే విధంగా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే అందరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించనున్నారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వం వైద్యం అందించాలని ఆయన అధికారులకు ఆదేశించనున్నారు. కాగా ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారుడు అజయ్ […]
పరిపాలనలో వేగాన్ని పెంచిన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచి మంచి ఫలితాలు సాధించే విధంగా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే అందరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించనున్నారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వం వైద్యం అందించాలని ఆయన అధికారులకు ఆదేశించనున్నారు. కాగా ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లాం, వైద్య శాఖ ప్రదాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం తరువాత జల వనరుల శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.