సీఎం జగన్ పీఏగా నాగేశ్వరరెడ్డి.. ఆయనెవరంటే..!
నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పీఏగా కె. నాగేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడపకు చెందిన నాగేశ్వరరెడ్డి 2008 నుంచి జగన్‌తోనే ఉంటున్నారు. వివిధ పత్రికల్లో పనిచేసిన ఆయన జగన్ నిర్వహించిన ప్రజాసంకల్ప పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. వివిధ వర్గాలకు చెందిన నేతలతో జగన్ సమావేశాలు నిర్వహించడంలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. అంతేకాదు గతేడాది విశాఖపట్టణంలో జగన్‌పై దాడి జరిగిన సమయంలోనూ ఆయన […]
నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పీఏగా కె. నాగేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడపకు చెందిన నాగేశ్వరరెడ్డి 2008 నుంచి జగన్‌తోనే ఉంటున్నారు. వివిధ పత్రికల్లో పనిచేసిన ఆయన జగన్ నిర్వహించిన ప్రజాసంకల్ప పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. వివిధ వర్గాలకు చెందిన నేతలతో జగన్ సమావేశాలు నిర్వహించడంలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. అంతేకాదు గతేడాది విశాఖపట్టణంలో జగన్‌పై దాడి జరిగిన సమయంలోనూ ఆయన పక్కనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటినుంచో నమ్మకంగా ఉంటోన్న ఆయనను జగన్ తన పీఏగా నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇక పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి. రవిశేఖర్‌ను వైఎస్ జగన్ ఎంచుకున్నారు.