ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి: పవన్

ఏపీ రాజధానిని మారుస్తారని జరుగుతున్న ప్రచారాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. మంత్రుల ప్రకటనతో రాజధాని రైతులతో పాటు ప్రజల్లో ఆందోళన నెలకొందని విమర్శించారు.  రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలే గందరగోళానికి కారణమయ్యాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుస్తారా? అని ప్రశ్నించారు. రేపు బొత్స సీఎం అయితే రాజధాని విజయనగరంలో పెడతారా? అని నిలదీశారు. రెండు రోజుల రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా తుళ్లూరులో […]

ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి: పవన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 31, 2019 | 6:35 AM

ఏపీ రాజధానిని మారుస్తారని జరుగుతున్న ప్రచారాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. మంత్రుల ప్రకటనతో రాజధాని రైతులతో పాటు ప్రజల్లో ఆందోళన నెలకొందని విమర్శించారు.  రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలే గందరగోళానికి కారణమయ్యాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుస్తారా? అని ప్రశ్నించారు. రేపు బొత్స సీఎం అయితే రాజధాని విజయనగరంలో పెడతారా? అని నిలదీశారు. రెండు రోజుల రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా తుళ్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. రాజధాని రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని పవన్ డిమాండ్ చేశారు.

రాజధానికి అవసరమైన డబ్బు జగన్‌ తన జేబులోంచి తీసి ఇవ్వడం లేదని పవన్‌ అన్నారు. హైదరాబాద్‌కు దీటుగా ఏపీ రాజధాని ఉండాలని ఆకాంక్షించారు. రాజధాని విషయంలో మాజీ సీఎం చంద్రబాబు అనుసరించిన వైఖరి అపోహలకు దారితీసిందని ఆరోపించారు. వేల ఎకరాల సేకరణ వల్లే అవినీతి జరిగిందని అనుమానాలు వచ్చాయని ఆయన అన్నారు. అన్ని ఎకరాలు అవసరం లేదని తాను గతంలో వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుందని తాను మాటిస్తున్నా అని పవన్‌ అన్నారు. అంతకుముందు రాజధాని ప్రాంతంలోని నిడమర్రు, కూరగల్లులో పర్యటించారు.