ఏపీలో పవర్ ప్రాబ్లమ్.. తెలంగాణ సీఎం సాయం కోరిన ఏపీ సీఎం

ఏపీలో పవర్ ప్రాబ్లమ్ వచ్చిపడింది. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోడానికి నడంబిగించింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు సీఎం జగన్. సింగరేణి నుంచి వస్తున్న 4 ర్యాకుల బొగ్గును, 9 ర్యాకులకు పెంచాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా విషయంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు కూడా మరో లేఖ […]

ఏపీలో పవర్ ప్రాబ్లమ్.. తెలంగాణ సీఎం సాయం కోరిన ఏపీ సీఎం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలజగడం.. మరింత ముదురుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు.. అంతకు మించిన విమర్శలు చేసుకుంటూ.. పొలిటికల్ ఎసరు కాస్తున్నారు. నిన్నటి వరకూ పరస్పర సహకారంతో ముందుకు సాగుతామన్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు.. ఇప్పుడు కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. మీరు దోచుకుంటున్నారంటే మీరేనంటూ ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు.
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2019 | 11:46 PM

ఏపీలో పవర్ ప్రాబ్లమ్ వచ్చిపడింది. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోడానికి నడంబిగించింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు సీఎం జగన్. సింగరేణి నుంచి వస్తున్న 4 ర్యాకుల బొగ్గును, 9 ర్యాకులకు పెంచాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా విషయంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు కూడా మరో లేఖ రాశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కోసం ఒడిశా లోని మహానది బొగ్గు గనులనుంచి సరఫరా తగ్గిందని, గని కార్మికులు సమ్మెలు చేయడం, భారీ వర్షాలే దీనికి కారణమంటూ ఏపీ ప్రభుత్వం పేర్కొంది. థర్మల్ కేంద్రాలకు 57 శాతానికిపైగా బొగ్గు సరఫరా తగ్గిందదని ప్రభుత్వం తెలిపింది. బొగ్గు కొరత సమస్య థర్మల్ విద్యుత్ కేంద్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు.

ఏపీ ట్రాన్స్ కో విద్యుత్ ఉత్పత్తిలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. సమస్య పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. విద్యుత్ ఉత్పత్తిలో అధిక విద్యుత్ థర్మల్ పవర్ ద్వారానే వస్తుండటంతో బొగ్గు దిగుమతులుపై దృష్టి సారించింది. అయితే ప్రస్తుతం విద్యుత్ సరఫరాకు ఏర్పడ్డ సమస్యకు ప్రధాన కారణం బొగ్గు దిగుమతులే అంటున్నారు అధికారులు. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ సమస్య ఉందని, ఆంధ్రప్రదేశ్‌కు బొగ్గు సరఫరా చేస్తున్న ఒడిశా మహానది బొగ్గు గనుల్లో పని నిలిచిపోవడంతో అక్కడినుంచి సరఫరా ఆగిపోయింది. అక్కడ కార్మికులు సమ్మె చేయడంతో పాటు భారీగా కురుస్తున్న వర్షాలు కూడా బొగ్గు దిగుమతికి ఆటకంగా మారాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

జెన్ కో ద్వారా 3500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉన్నప్పటికీ, బొగ్గు కొరతతో 1500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. వర్షాలు, ఇతర సమస్యల వల్ల రోజు 75వేల మెట్రిక్ టన్నులకు గాను, 45 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే బొగ్గు వస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రానికి బొగ్గు సరఫరా 57 శాతానికి పైగా తగ్గినట్టు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు డొంకరాయి-సీలేరులో పవర్‌ కెనాల్‌కు గండి పడటం కూడా మరో కారణంగా ప్రభుత్వం తెలిపింది. దీని పునరుద్ధరణ పనులకు భారీ వర్షాలు ఆటంకంగా మారాయి.

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.