గోదావ‌రి జిల్లాల్లో వ‌ర‌ద ప‌రిస్థితుల‌‌పై సీఎం జ‌గ‌న్ ఆరా

గోదావ‌రి జిల్లాల్లో వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై సీఎం జ‌గ‌న్ ఆరా తీశారు. సీఎంవో కార్యాల‌య అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్ప‌టికే చాలా మందిని త‌ర‌లించార‌ని, వ‌చ్చే వ‌ర‌ద‌ను దృష్టిలో ఉంచుకుని మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టుగా..

గోదావ‌రి జిల్లాల్లో వ‌ర‌ద ప‌రిస్థితుల‌‌పై సీఎం జ‌గ‌న్ ఆరా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 16, 2020 | 11:25 PM

గోదావ‌రి జిల్లాల్లో వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై సీఎం జ‌గ‌న్ ఆరా తీశారు. సీఎంవో కార్యాల‌య అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్ప‌టికే చాలా మందిని త‌ర‌లించార‌ని, వ‌చ్చే వ‌ర‌ద‌ను దృష్టిలో ఉంచుకుని మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టుగా సీఎంవో అధికారులు సీఎంకు వివ‌రించారు. అలాగే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు ఈ మేర‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్టుగా కూడా ఆయ‌న‌కు తెలిపారు. వ‌ద‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ముంపున‌కు గుర‌య్యే ప్రాంతాల‌పై దృష్టి పెట్టాల‌ని, ఎలాంటి ప్రాణ న‌ష్టం లేకుండా వారిని ర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించారు.

ప్ర‌త్యేకంగా స‌హాయ పున‌రావాస శిబిరాలు తెరిచి ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు అన్ని ర‌కాల సౌక‌ర్యాలు అందించాల‌న్నారు. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఇద్ద‌రు క‌లెక్ట‌ర్లు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాల‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ర‌క్ష‌ణ చ‌ర్య‌లు, స‌హాయ పున‌రావాస కార్య‌క్ర‌మాల కోసం ఎన్టీఆర్ఎఫ్‌, స‌హా సంబంధిత సిబ్బందిని సిద్ధం చేసుకోవాల‌న్నారు. ఇక రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లును ఆదేశించారు సీఎం. గోదావరి వరద ఉద్ధృతి, ముంపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు. ఇటు కృష్ణా జిల్లాలో కూడా భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం ఆరా తీశారు.

Read More:

ధోనీ పేరుతో జొమాటో అద్భుత‌మైన ఆఫ‌ర్‌

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

వెద‌ర్ వార్నింగ్ః తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్