ఆగష్టు 15 ఏపీ రాజధాని తరలింపు.. పంద్రాగస్టు వేడుకలు అక్కడే…

ఏపీ రాజధాని తరలింపుకు ముహూర్తం ఖరారైంది. ఆగష్టు 15న విశాఖలో సీఎం కార్యాలయానికి భూమి పూజ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆగష్టు 15 ఏపీ రాజధాని తరలింపు.. పంద్రాగస్టు వేడుకలు అక్కడే...
Follow us

|

Updated on: Aug 01, 2020 | 1:08 AM

Three Capitals For Andhra Pradesh: ఏపీ రాజధాని తరలింపుకు ముహూర్తం ఖరారైంది. ఆగష్టు 15న విశాఖలో సీఎం కార్యాలయానికి భూమి పూజ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక పంద్రాగస్టు వేడుకలు కూడా విశాఖ నగరంలోనే జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. దశలవారీగా ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా తరలించనున్నారు.

కాగా, ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఅర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనితో మూడు రాజధానులు అమలులోకి వచ్చాయి. ఇకపై ఎపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం ఉండబోతుండగా.. జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉండబోతున్నాయి.

ఇదిలా ఉంటే 2019, డిసెంబర్ 18వ తేదీన తొలిసారిగా సీఎం జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ అంశంపై గతేడాది డిసెంబర్ 20న ప్రభుత్వానికి జీఎన్‌రావు కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక 2020, జనవరి 4వ తేదీన బీసీజీ గ్రూప్ మూడు రాజధానుల అంశంపై మరో నివేదిక సమర్పించింది. దీనితో జనవరి 20, 2020న పరిపాలన వికేంద్రీకరణ, సీఅర్డీఏ రద్దు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అయితే ఆ తర్వత రెండు రోజులకే ఈ మూడు రాజధానుల విషయంపై శాసనమండలిలో రగడ జరిగింది. ఇక అదే రోజున చైర్మన్ విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపించారు. అటు జూలై 17న గవర్నర్ ఆమోదం కోసం ఏపీ సర్కార్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును పంపించగా.. జూలై 31న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారికంగా బిల్లుకు ఆమోదముద్ర వేశారు.

Also Read:

మహిళల కోసం మరో రెండు పధకాలు.. జగన్ సర్కార్ సంచలనం

హైదరాబాద్‌లో కరోనా పరీక్షల కేంద్రాల వివరాలివే.!

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగష్టు 15 నుంచి వీడియో పాఠాలు!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్.!